Prabhas: ఇంకొన్నాళ్లు రెస్ట్ తప్పదా.. ప్రభాస్ సెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?
అక్టోబర్ 22 న హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాక.. ప్రభాస్ బర్త్ డే రోజు సలార్ తాలూకు అప్‌డేట్ రానుంది. చిన్నపాటి వీడియోని ఇంట్లో నుంచే షూట్ చేసి ఇన్‌స్టాలో అప్‌డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభాస్ దీపావళి తర్వాతే సినిమా షూటింగులకు రెడీ అవుతాడట.
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్‌కి యూరప్‌లో మోకాలి సర్జరీ అయినప్పటి నుంచి తను అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడు. మరో మూడు వారాలు రెస్ట్ తీసుకుని ఇండియా బయలు దేరనున్నాడు. అక్టోబర్ 23న తన బర్త్ డే అవటంతో ఒకరోజు ముందే హైదరాబాద్‌లో ల్యాండ్ కాబోతున్నాడు. అంతవరకు ఓకే.. తర్వాత ఏం చేస్తాడంటే, అక్కడే ట్విస్ ఉంది.
అక్టోబర్ 22 న హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాక.. ప్రభాస్ బర్త్ డే రోజు సలార్ తాలూకు అప్‌డేట్ రానుంది. చిన్నపాటి వీడియోని ఇంట్లో నుంచే షూట్ చేసి ఇన్‌స్టాలో అప్‌డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభాస్ దీపావళి తర్వాతే సినిమా షూటింగులకు రెడీ అవుతాడట. అంటే ఇండియా చేరుకున్నాక కూడా కనీసం రెండు మూడు వారాలు రెస్టే తీసుకోబోతున్నాడు ప్రభాస్. ఇప్పటికే నెల, ఆ తర్వాత కూడా మరో నెలంటే నిజంగానే ప్రభాస్‌కి మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీ అయ్యిందనుకోవాల్సి వస్తోంది. అంతేకాదు దీపావళి తర్వాత ప్రభాస్‌కి ఫిజియో థెరపీ ఉంటుందట.
దానికి మరో మూడు వారాలు కావాలి. అలా తన మోకాలి మీద ఒత్తిడి తగ్గేలా, తను నడవగలిగే వరకు ఫిజియో థెరపీ వాకింగ్ చేయాల్సిందేనట. సో.. ఇదంతా చూస్తుంటే నవంబర్ 20 నుంచే తను మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రభాస్ హెల్త్ ప్లానింగ్ వల్లే ఈ విషయం రివీల్ అయ్యింది.