ప్రభాస్ + ఎన్టీఆర్.. ఇద్దరినీ కలిపినా అతనే కింగ్…
రెబల్ స్టార్ ప్రభాస్ ఐదు పాన్ ఇండియా హిట్లతో 5 వేల కోట్లు రాబట్టిన పాన్ ఇండియా కింగ్ గా మారాడు. త్రిబుల్ ఆర్, దేవరతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియాని ఏలాడు. కలెక్షన్స్ మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా, 1890 కోట్ల పోస్టర్ ని వదిలారు కాబట్టి బన్నీ కూడా పాన్ ఇండియా కింగ్స్ లిస్ట్ లో చేరినట్టే... ఇవన్నీ చూశాక ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరో ఎవరూ అంటే ఈ ముగ్గురి పేరు చెప్పొచ్చు...

రెబల్ స్టార్ ప్రభాస్ ఐదు పాన్ ఇండియా హిట్లతో 5 వేల కోట్లు రాబట్టిన పాన్ ఇండియా కింగ్ గా మారాడు. త్రిబుల్ ఆర్, దేవరతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియాని ఏలాడు. కలెక్షన్స్ మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా, 1890 కోట్ల పోస్టర్ ని వదిలారు కాబట్టి బన్నీ కూడా పాన్ ఇండియా కింగ్స్ లిస్ట్ లో చేరినట్టే… ఇవన్నీ చూశాక ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరో ఎవరూ అంటే ఈ ముగ్గురి పేరు చెప్పొచ్చు… లేదంటే అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ లాంటి స్టార్లే అయ్యుండొచ్చు అని అంతా అనుకోవాచ్చు.. కాని అవేవి నిజం కాదు. ఇండియాకి అంబాని, అదాని ఎలానో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అలాంటి వాడు షారుఖ్ ఖాన్… అవును సూపర్ స్టార్ రజినీకాంత్, మెగా స్టార్ చిరంజీవి, బాలీవుడ్ బడా బచ్చన్ అమితాబ్.. ఇలా ఎవరూ కూడా షారుఖ్ కి దరిదాపుల్లో లేరు… తన తర్వాత ప్లేస్ కూడా హిందీ వాళ్లకే దక్కింది. విచిత్రం ఏంటంటే కింగ్ నాగార్జునాకి పాన్ ఇండియా హిట్ ఒక్కటి రాకున్నా, తను మూడో పాన్ ఇండియా కింగ్ గా మారాడు.. భారతీయ నటుల్లో భాగా డబ్బున్న స్టార్స్ లిస్ట్ లో మూడో స్థానంలో ఉన్నాడు నాగ్. ఇంతకి ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ అండ్ కో ఈ లిస్ట్ లో ఏ స్థానంలో ఉన్నట్టు…? ఆస్తులకి పాన్ ఇండియా హిట్లకి సంబంధం లేనట్టేనా..? టేకేలుక్
పాన్ ఇండియా హీరోలు, పాన్ ఇండియా హిట్లు వాటికొచ్చిన వసూళ్లని కలపినా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ దగ్గరున్న డబ్బుతో సమానం కాదని తెలుస్తోంది. దేశంలోకెళ్లా రిచ్చెస్ట్ ట్రిలియనీర్లంటే అదాని, లేదంటే అంబాని.. అచ్చంగా దేశంలో బాగా ధనవంతులైన స్టార్స్ ఎవరంటే మాత్రం అక్కడ ప్రభాస్ పేరో, రజినీకాంత్ పేరో వినిపించట్లేదు.
ఎందుకంటే దేశంలోనే అత్యదిక పారితోషికం తీసుకుంటున్న ప్రబాస్ హాలీవు్డ స్టార్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు. తను 550 కోట్ల పారితోషికం తీసుకుంటుంటే, ఎన్టీఆర్ 350 కోట్లు, తమిల సూపర్ స్టార్ రజినీకాంత్ 300 కోట్లు తీసుకుంటున్నారు. అయినా వీళ్లేవరు ధనవంతులైన ఫిల్మ్స్ స్టార్స్ లిస్ట్ లో లేరు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిచ్చెస్ట్ స్టార్స్ అంటే షారుఖ్, జూహీ చావ్లా, కింగ్ నాగార్జున పేర్లే వినిపిస్తున్నాయి.
షారుఖ్ అంటే బాలీవుడ్ బాద్ షా, బ్యాక్ టు బ్యాక్ వరుస రెండు హిట్లతో రెండు సార్లు 1000 కోట్ల వసూళ్లు రాబట్టాడు కాబట్టి, రిచ్చెస్ట్ స్టార్స్ లిస్ట్ లో నెం.1 అంటే నమ్మొచ్చు.. కాని తన తర్వాత స్థానంలో అసలు అడ్రస్ లేని వెటరన్ హీరోయిన్ జూహీ చావ్లా ఉంది… షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ 7300 కోట్లు… జూహీ చావ్లా ఆస్తుల విలువ 4600 కోట్లు.. ఇక కింగ్ నాగార్జున మొత్తం ఆస్తుల విలువ 3400 కోట్లు.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంతే కాదు, నటిసింహం బాలయ్య నుంచి వెంకీ వరకు మరే హీరోలు నాగ్ తో పోల్చుకోలేనంద, ధనవంతుడని తెలుస్తోంది. ఇక కింగ్ ఖాన్ షారుఖ్ ఆస్తుల్లో తన రెడ్ చిల్లీస్ బ్యానర్ భారీ వ్యాపార సామ్రాజ్యంగా మారింది. సినిమాలు, యాడ్స్, తో పాటు చాలా వ్యాపారాల్లో ఉన్న భాగస్వామ్యం తోనే తను ఇంతగా సంపాదించాడట. జూహీ చావ్లా రియాల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల అంతగా సంపాదించిందని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున విషయానికొస్తే, స్థలాలే కోట్లు విలువ చేసేవి ఉన్నాయట
హోటల్ బిజినెస్, రియలెస్టేట్, అలానే సినిమాల ప్రొడక్షన్, షామ్ హైజులు అందులో చాలా ఎకరాల విలువే వేయ్యికోట్లపైనుంటుందట. ఇక విదేశీ హోటల్స్ లో పెట్టుబడులు వేరు… ఇక తన ఇంటి విలువే 50 కోట్లు ఉంటుందట. తన దగ్గరున్న కార్లన్నీంటి విలువే 10 నుంచి 12 కోట్లుంటుందని తెలుస్తోంది. ఇవి కాకుండా ఖరీదైన షాపింగ్ మాల్స్, వాటికొచ్చే రెంట్స్ ఇవి కాకుండా అన్నపూర్ణ స్టూడియో బిజినెస్ తోనే భారీగా సంపాదించాడట నాగ్. తను సినిమాకు 20 కోట్లే తీసుకుంటున్నా, తన సంపాదని సరైన దారిలో పెట్టుబడి పెట్టి వేలకోట్లు సంపాదించాడనంటున్నారు.
ఇక ఈ రిచ్చెస్ట్ స్టార్స్ లిస్ట్ లో 2000 కోట్ల ఆస్తులతో హ్రితిక్ నాలుగోస్థానంలో ఉంటే, 1600 కోట్ల ఆస్తులతో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఐదో స్థానంలో ఉంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ 1400 కోట్లతో ఆరోస్థానంలో, ఉన్నాడు.. ఐతే సల్మాన్ ఖాన్ కి 2900 కోట్లు, ఆమిర్ కి 1900 కోట్ల ఆస్తులున్నా, ఈ లిస్ట్ లో వాళ్ల పేర్లులేవు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మెగా హీరోలందరి ఆస్తుల విలువ 8 వేల కోట్ల పైనే ఉంటుందనేది ఓ అంచనా… చరణ్ ఆస్తులే 2200 కోట్ల వరకుంటాయంటారు. ఎన్టీఆర్ ఆయితే ఫామ్ హౌజులు ఎక్కువ ఎకరాలు కొనటం వల్ల, వాటి విలువ లెక్కేస్తే వేలకోట్లు వెనకేసినట్టే అంటున్నారు. కాకపోతే బాలీవుడ్ బ్యాచ్ఆస్తుల మీదున్న క్లారిటీ తెలుగు హీరోల ఆస్తుల మీద దొరికినట్టు లేదు. అందుకే ఇలా తెలుగు, హీరోల పేర్లు ఈ లిస్ట్ లో కనిపించట్లేదు.