ప్రభాస్, ఎన్టీఆర్, యష్ తో ప్రశాంత్ నీల్ గేమ్స్.. మూడు సినిమాలకు వర్క్ స్టార్ట్
కేజిఎఫ్ సీరీస్ పై ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ క్రియేట్ అయింది. కేజిఎఫ్ విషయంలో డైరెక్టర్ విజన్ కు ఆడియన్స్ ఫిదాఅయిపోయారు. ఈ సినిమాలో యష్ ను డైరెక్టర్ చూపించిన విధానానికి కూడా ఫుల్ మార్క్స్ పడ్డాయి.
కేజిఎఫ్ సీరీస్ పై ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ క్రియేట్ అయింది. కేజిఎఫ్ విషయంలో డైరెక్టర్ విజన్ కు ఆడియన్స్ ఫిదాఅయిపోయారు. ఈ సినిమాలో యష్ ను డైరెక్టర్ చూపించిన విధానానికి కూడా ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఒక హీరోకి ఎలివేషన్స్ సీన్స్ పెడితే ఏ రేంజ్ లో ఉంటుందో కేజిఎఫ్ లో క్లియర్ కట్ గా చూపించాడు డైరెక్టర్. ఇక ఈ ప్రాజెక్ట్ లో మరో సినిమా రానుంది. కే జి ఎఫ్ పార్ట్ 3 గా రాబోతున్న సినిమా విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటినుంచే వర్కౌట్ మొదలుపెట్టడం చూసి జనాలు షాక్ అవుతున్నారు.
ప్రశాంత్ చేతిలో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ముందుకు వెళ్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సలార్ సీక్వెల్ రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ఈ సినిమా తర్వాత హీరోగా కేజిఎఫ్ పార్ట్ 3 ని ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. అయితే ఈ మూడు ప్రాజెక్టులకు ఒకేసారి వర్క్ చేయడం సెన్సేషనల్ గా మారింది. కేజీఎఫ్ 2కు ప్రీక్వెల్ గా ఈ సినిమా రానున్నట్లు టాక్.
ఈ సినిమా రెండో భాగం లో చూపించని 1978- 1981 మధ్యకాలంనాటి రాకీ భాయ్ జీవితాన్ని చూపిస్తారు. ఇది వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఖాళీ టైంలో ఈ సినిమాపై వర్క్ చేయడం మొదలుపెట్టాడు ప్రశాంత్ నీల్. కథ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కేజీఎఫ్ పార్ట్ 2 విషయంలో కొన్ని కామెంట్స్ వచ్చాయి. సినిమాలో కథ లేదు అనే విమర్శలు రావడంతో ఈ సినిమాపై గట్టిగానే వర్కౌట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాల తో బిజీగా ఉండడం.. ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బిజీగా ఉండటంతో.. కే జి ఎఫ్ త్రీ కోసం వర్క్ మొదలుపెట్టాడు.
పార్ట్ 2 సమయంలోనే దీనికి సంబంధించి కొంత షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు మిగిలిన షూటింగ్ కోసం ప్రశాంత్ ప్లాన్ ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం యష్.. టాక్సిక్ అలాగే రామాయణం చిత్రాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఈ రెండు పూర్తయిన వెంటనే కేజీఎఫ్ 3 కోసం వర్క్ చేస్తాడు. ఆ రెండు పూర్తి అయ్యే టైంకి ప్రశాంత్ కూడా ఫ్రీ అయ్యా ఛాన్స్ ఉంది. కే జి ఎఫ్ సినిమాలతో పానీ ఇండియా స్టార్ గా మారిన ఈ డాషింగ్ హీరోకి ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ హంబలే ఫిలిమ్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసిందట. ఇక ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఫిబ్రవరి రెండో వారంలో వర్క్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అలాగే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేసిన డైరెక్టర్.. ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మొన్నామధ్య సలార్ సీక్వెల్ కోసం కూడా వర్క్ చేసినట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.