ప్రభాస్, ఎన్టీఆర్ కొత్త టార్గెట్.. చైనా, కొరియానే ఎందుకు..?
రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైలెంట్ గా వాళ్ళ ఫోకస్ ని చైనా,కొరియాకి షిఫ్ట్ చేశారు. వాళ్ల స్ట్రాటజీ పెద్దగా ఫోకస్ కావట్లేదు కాని, వాళ్ల కొత్త టార్గెట్ మాత్రం చైనా, కొరియానే అని తెలుస్తోంది. ఆల్రెడీ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరోగానే కాదు, పాన్ ఇండియా కింగ్ గా మార్కెట్ ని శాసిస్తున్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైలెంట్ గా వాళ్ళ ఫోకస్ ని చైనా,కొరియాకి షిఫ్ట్ చేశారు. వాళ్ల స్ట్రాటజీ పెద్దగా ఫోకస్ కావట్లేదు కాని, వాళ్ల కొత్త టార్గెట్ మాత్రం చైనా, కొరియానే అని తెలుస్తోంది. ఆల్రెడీ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరోగానే కాదు, పాన్ ఇండియా కింగ్ గా మార్కెట్ ని శాసిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా మరో పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్నాడు. అలాంటి ఈ ఇద్దరు కలిసి డిసీజన్ తీసుకున్నారో… కలిసొస్తుంది కదా అని నిర్ణయం తీసుకున్నారో.. మొత్తానికి పొరుగింటి మీద కన్నేశారు. చైనా మార్కెట్ అంటే పెద్దది, అక్కడి వసూళ్ల మీద కన్నేశారంటే అర్ధం చేసుకోవచ్చు.. కాని కొరియా మార్కెట్, కనీసం టాలీవుడ్ మార్కెట్ అంత కూడా ఉండదు… అయినా, ఆ మార్కెట్ లో జెండా ఎగరేయాలనుకుంటున్నారు ఎందుకు..? ఈ టార్గెట్ సక్సెస్ అయితే ఇద్దరూ 5 వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల స్టార్స్ గా మారే అవకాశం ఉందంటున్నారు. అదెలా సాధ్యం?
ఇండియాలో ఓ సినిమా హిట్టైతే 1000 నుంచి 1800 కోట్లవరకు వసూల్లొస్తాయని బాహుబలి 2 తో తేలింది. అంతకుమించి వసూళ్లు రావాలంటే చైనాలో మన సినిమా దుమ్మదులపాలని దంగల్ మూవీ తేల్చింది. ఇండియాలో 800 కోట్ల రాబట్టిన ఈ సినిమా, చైనాలో ఏకంగా 1200 కోట్లు రాబట్టింది. అందుకే అది బాహుబలి 2ని దాటింది. లేదంటే బాహుబలి 2నే ఇప్పటికీ ఇండియా నెంబర్ వన్ గా ఉండేది..
ఏదేమైనా చైనాలో మన సినిమా ఆడితే ఈజీగా 1000 నుంచి 4వేల కోట్ల వరకు అదనపు ఆదాయం ఉందని తేలింది. అయిన ఆమిర్ ఖాన్ తప్ప మరెవరు అటువైపు చూడలేదు. మహారాజా మూవీతో విజయ్ సేతుపతి అటువైపు అడుగులేశాడు కాని, అదంత సాలిడ్ అటెమ్ట్ కాదు..
అందుకే చైనా మార్కెట్ ని మరో లా టార్గెట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్… స్పిరిట్ లో ఆల్రెడీ కొరియా హీరోని విలన్ గా తీసుకుంటున్నారు. కొందరు చైనా ఆర్టిస్టులని కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కి వాడబోతున్నారట.
కొరియా మార్కెట్ లో మన సినిమా ఎంట్రీ ఇస్తే, ఆటో మేటిగ్గా చైనా మార్కెట్ లో కూడా ఎంట్రీ కి ఛాన్స్ఉంటుంది. కొరియన్ నటులు చైనాలో ఫేమస్ కాబట్టి, ఇలా ఇండైరెక్ట్ గా చైనా మార్కెట్ ని స్పిరిట్ మూవీ టార్గెట్ చేస్తోంది
కొరియా మార్కెట్ చిన్నదే అయినా, అక్కడ మన సినిమా పేలితే, యూరప్ లో కూడా ఈజీగా రీచ్ పెరుగుతుంది. కొరియన్ డ్రామాలకు యూరప్ లోఉన్న పాపపులారిటీనే, మన సినిమాకు ఇలా కలొసొచ్చే ఛాన్స్ఉంది. అలానే చైనామార్కోట్ లోకూడా ఈ ఇండైరెక్ట్ ఎటాక్ కలిసొస్తుంది
ఇక ఎన్టీఆర్ మాత్రం ప్రభాస్ లా పరోక్షంగా కాకుండా, డైరెక్ట్ గా నే చైనా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. అందుకే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో చేస్తున్న మూవీకి డ్రాగన్ పేరు పెట్టారట. కథ కూడా కంప్లీట్ గా 70శాతం చైనా చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. చైనీస్ ఆర్టిస్ట్ లనే ఫిల్మ్ టీం రంగంలోకి దింపుతోంది. మొత్తానికి జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్, ప్రభాస్, ఇలా పాన్ ఆసియాని చైనా, కొరియా రూపంలో టార్గెట్ చేశారు. తర్వాతే పాన్ వరల్డ్ మార్కెట్ ని క్యాప్చర్ చేస్తామంటున్నారు. పక్కాగా స్ట్రాటజీతోనే వెళుతున్నారు. మొత్తానికి తెలుగు సినిమాలో, అమెరికన్లు, యూరోపీయన్లే కాదు, చైనీస్, కొరియన్లు కూడా కనిపించే కాలం ముందు ముందుగా రాబోయేలా ఉంది.