Prabhas: ప్రభాస్‌కు సర్జరీ తప్పదా..? ఎన్ని నెలలు బ్రేక్ తీసుకోవాలి..?

ఏడాది క్రితమే డిస్క్ సమస్య ఎదురవ్వటంతో ప్రభాస్ ఫిజియో థెరపీతో టెంపరరీగా ఇబ్బందినుంచి బయట పడ్డాడు. కానీ ప్రస్తుతం సర్జరీ అవసరమయ్యేలా ఉంది. డిస్క్ సమస్య వల్ల ఆ నరం తుంటి, మోకాలి నొప్పికి కారణమౌతోందట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2023 | 05:25 PMLast Updated on: Aug 16, 2023 | 5:25 PM

Prabhas On Medical Leave For Knee Surgery Take A Break From Movies

Prabhas: ప్రభాస్ మోకాలికి సర్జరీ తప్పేలా లేదు. ఒక వైపు వెన్ను నొప్పి, మరో వైపు కుడి మోకాలి నొప్పి. ఈ రెండు ఇబ్బందులతోనే రాధేశ్యామ్ నుంచి సలార్ వరకు ఒక్కో మూవీ చేస్తూ నెట్టుకుంటూ వస్తున్నాడట ప్రభాస్. ఏడాది క్రితమే డిస్క్ సమస్య ఎదురవ్వటంతో ప్రభాస్ ఫిజియో థెరపీతో టెంపరరీగా ఇబ్బందినుంచి బయట పడ్డాడు. కానీ ప్రస్తుతం సర్జరీ అవసరమయ్యేలా ఉంది. డిస్క్ సమస్య వల్ల ఆ నరం తుంటి, మోకాలి నొప్పికి కారణమౌతోందట.

అయితే ఇదేదో మోకాళ్ళు అరగటం వల్ల వచ్చిందేమో, మోకాలి చిప్ప మారుస్తారేమో అంటూ ప్రచారాలు జరిగాయి. చిరంజీవి మోకాలు వాష్ సర్జరీ లాంటి చిన్న పాటి సర్జరీతో ప్రభాస్ బయటపడతాడనే గుసగుసలు కూడా వినిపించాయి. వాస్తవం మరోలా ఉందని ప్రచారం జరుగుతోంది. నిజానికి మోకాలి వాష్ సర్జరీ కోసం ప్రభాస్ నెలక్రితమే ప్లాన్ చేసుకున్నాడని గుసగుసలొచ్చాయి. సలార్ ప్యాచ్ వర్క్, కల్కీ 2898 తోపాటు మారుతీ మూవీని నవంబర్ లోగా పూర్తి చేసి డిసెంబర్‌లో సర్జరీ చేసుకోవాలని, ఆ తర్వాత రెస్ట్ తీసుకోవాలనేది ప్రభాస్ ప్లానింగ్. అయితే, తనది చిరులా కేవలం మోకాలి సమస్య కాదని తేలిందట. డిస్క్ సమస్యని సరిచేస్తేనే తుంటి, మోకాలి సమస్య తీరుతుందని, ఇది కనెక్ట్ అయిన నరం వల్లే సమస్య అని తెలుస్తోంది.

ఏదేమైనా డిస్క్ తాలూకు మైనర్ సర్జరీ అంటే కనీం 3 నుంచి 6 నెలలు ప్రభాస్ సినిమా షూటింగ్స్‌కి బ్రేక్ పడుతుంది. సో స్పిరిట్ మూవీ జనవరిలో కాదు సమ్మర్ తర్వాతే అంటున్నారు. అదెలా ఉన్నా నిజంగానే ప్రభాస్ సర్జరీకే ఫిక్స్ అయితే, ఫిజియో థెరపీ వల్ల సమస్య సాల్వ్ కాలేదంటే, తన హెల్త్ పరోక్షంగా సినిమాలను, ఫ్యాన్స్ ని కంగారు పెట్టించటం ఖాయం.