Prabhas: ప్రభాస్ మోకాలి సర్జరీ వెనుక పెద్ద కథే ఉందా..?

ప్రభాస్ మోకాలు మార్పిడి సర్జరీ చేసుకోబోతున్నాడు అని అంచనా వేస్తున్నారు. బేసిగ్గా మోకాలి సర్జరీ అంటే ఒకటి- రెండు ఎముకలమధ్య రాపిడి పెరిగితే, చిన్నపాటి కోతతో మోకాళి మధ్య క్లీన్ చేస్తారు. అది మైనర్ సర్జరీ కిందకి వస్తుంది. దానికి రెండు వారాల టైం సరిపోతుందట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 12, 2023 | 06:31 PMLast Updated on: Sep 12, 2023 | 6:31 PM

Prabhas On Medical Leave More Than One Month After Knee Surgery

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ యూరప్ ట్రిప్ తన మోకాలి సర్జరీ కోసం అని ఎప్పుటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలానే తన మోకాలి సర్జరీ ఈ వీకే అన్నారు. 15 రోజులు అక్కడే రెస్ట్ తీసుకునే ప్రభాస్, ఇండియాకొచ్చాక కూడా నెలకు పైనే ఇంటిపట్టున ఉండబోతున్నాడట. దీన్నిబట్టి చూస్తుంటే, ప్రభాస్ మోకాలు మార్పిడి సర్జరీ చేసుకోబోతున్నాడు అని అంచనా వేస్తున్నారు. బేసిగ్గా మోకాలి సర్జరీ అంటే ఒకటి- రెండు ఎముకలమధ్య రాపిడి పెరిగితే, చిన్నపాటి కోతతో మోకాళి మధ్య క్లీన్ చేస్తారు.

అది మైనర్ సర్జరీ కిందకి వస్తుంది. దానికి రెండు వారాల టైం సరిపోతుందట. కాని నెలకు పైనే టైం తీసుకుంటున్నాడు అంటే, ప్రభాస్ మోకాలు మార్పిడి సర్జరీనే చేయించుకున్నాడంటున్నారు. అసలే 6 అడుగుల 4 అంగుల ఎత్తు.. భారీ పర్సనాలిటీ.. దీనికి తోడు వరుసగా యాక్షన్ సీక్వెన్స్‌తో కూడిన సీన్లు చేయటం.. ఈప్రాసెస్‌లోనే తన మోకాలి చిప్పకి క్రాక్స్ వచ్చాయనే ప్రచారం జరిగింది. ఇంకా పెల్లి కాలేదు. తను 50 లో పడనే లేదు. అంతలోనే మోకాలి మార్పిడి చేస్తారా అంటే.. 90శాతం చేయరు. ఒకవేళ తనది మోకాలి మార్పిడి కాకపోతే, నెలన్నరటైం ఎందుకు తీసుకుంటున్నట్టు అంటే మాత్రం మరో థియరీ వినిపిస్తోంది. దాని ప్రకారం, కల్కి 2898, స్పిరిట్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. కాబట్టి ప్రభాస్ స్ట్రాంగ్‌గా ఉంటేనే అవి సాధ్యం.

కాబట్టే కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఎక్కువ టైం తీసుకున్నాకే షూటింగ్‌కి వెళ్లాలని ప్రభాస్‌కి డాక్టర్లు ఇచ్చిన సలహా అని అంటున్నారు. కాబట్టి చిరు, ప్రభాస్ ఇద్దరిదీ మోకాలి జంక్షన్‌లో క్లీనింగ్ చేసే మైనర్ సర్జరీనే అనే వాదన కూడా వినిపిస్తోంది.