ప్రభాస్ వద్దన్న పని చేస్తున్న యంగ్ టైగర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పఠాన్ డైరెక్టర్ సినిమా అన్నప్పుడు ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. తీరా చూస్తే టైగర్ వర్సెస్ పఠాన్ అంటూ షారుఖ్, సల్మాన్ కాంబినేష్ లో ఆ దర్శకుడు వేరే మూవీ కమిటవ్వగానే ఇలా ఎందుకయ్యింది చెప్మా అనుకున్నారు.
కట్ చేస్తే అసలు డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ చెప్పిన కథకి, ప్రాజెక్ట్ కి ప్రభాస్ ఓకే చెప్పలేదు. దాంతో హర్ట్ అయిన సిద్దార్ధ్ అసలు ఆ ప్రాజెక్ట్ నే పక్కన పెట్టాడు. అదే వార్ సీక్వెల్ వార్ 2. హ్రితిక్ రోషన్ తో కలిసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోవలసింది. కాని ప్రభాస్ నో చెప్పడంతో హార్ట్ అయిన దర్శకుడు తనేం తక్కువ కాదని ప్రూవ్ చేసుకునేందుకే ఆగమేఘాల మీద షారుఖ్, సల్మాన్ తో కలిపి టైగర్ వర్సెస్ పఠాన్ మూవీ ప్లాన్ చేశాడు
అంతా బానే ఉంది. కాని వార్ 2 లో ఇప్పుడు ప్రభాస్ ప్లేస్ లో ఎన్టీఆర్ ఉండటమే ఫ్యాన్స్ ని కంగారు పెట్టించేలా ఉంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ సిద్దార్ధ్ ఆనంద్ మేకింగ్ లో ప్లాన్ చేశారు. తనే పక్కకు తప్పుకున్నాక బ్రహ్మస్త్ర ఫేం అయాన్ ముఖర్జీతో ప్లాన్ చేయటమే రాంగ్ డిసీషన్ అంటున్నారు. ప్రభాస్ వద్దన్న పని చేస్తూ తారక్ రాంగ్ రూట్లో వెళుతున్నాడేమో అనేస్తున్నారు.