ప్రభాస్ పొలిటికల్ ప్రాజెక్ట్… ఇదెక్కడి ట్విస్ట్ రాజు గారు…?
ఇండియన్ సినిమాలో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ 1 హీరో ఎవరూ అంటే వినపడే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. సినిమా హిట్ ఫ్లాప్ తో ఏ సంబంధం లేకుండా బాక్సాఫీస్ బెండు తీయడానికి ప్రభాస్ తన సినిమాలతో ఓ రకంగా యుద్దమే చేస్తున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సినిమా ఇండస్ట్రీలో ఇది వరల్డ్ వార్ లెక్క అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
ఇండియన్ సినిమాలో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ 1 హీరో ఎవరూ అంటే వినపడే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. సినిమా హిట్ ఫ్లాప్ తో ఏ సంబంధం లేకుండా బాక్సాఫీస్ బెండు తీయడానికి ప్రభాస్ తన సినిమాలతో ఓ రకంగా యుద్దమే చేస్తున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సినిమా ఇండస్ట్రీలో ఇది వరల్డ్ వార్ లెక్క అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఏడు సినిమాలను లైన్ లో పెట్టి ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తూ… బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రభాస్ సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ లో పూనకాలు రావడం ఖాయం.
ఇక ప్రభాస్ ఇప్పుడు ది రాజాసాబ్ ను రిలీజ్ చేయడానికి అవుతున్నాడు. వచ్చే ఏడాది మార్చ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు ప్రభాస్ చేయని రోల్ ఈ సినిమాలో చేస్తున్నారు. హారర్ మూవీగా వస్తోంది రాజాసాబ్. ఈ సినిమా తర్వాత ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఆర్మీ ఆఫీసర్ కథతో ఈ సినిమా చేస్తున్నట్టు టాక్. దీని షూటింగ్ ప్రభాస్ లేకుండా కొంత కంప్లీట్ చేసారు. ఇదే గ్యాప్ లో సలార్ 2 షూట్ కూడా స్టార్ట్ అయింది. త్వరలోనే ప్రభాస్ కూడా సలార్ సెట్స్ కు వెళ్ళే ఛాన్స్ కనపడుతోంది. కల్కీ 2 కూడా లైన్ చేసాడు.
దీనిపై ఇప్పటికే డైరెక్టర్ నాగ్ అశ్విన్ వర్క్ స్టార్ట్ చేసాడు. ఈ టైం లో ఓ న్యూస్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ప్రభాస్ 2028 వరకు బిజీ అయిపోయాడు. 2029 మూవీ ఏంటీ అనేది క్లారిటీ లేదు. హోంబలే 2028 వరకు ప్రభాస్ సినిమాలను రిలీజ్ చేస్తుంది. అంటే అప్పటి వరకు బిజీగా ఉండే ప్రభాస్… ఆ తర్వాత ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా సితారా బ్యానర్ లో చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ విషయాన్ని సూర్యదేవర నాగ వంశీ బయటపెట్టారు. ప్రభాస్ పేరు చెప్పకపోయినా 2029కి ఓ స్టార్ హీరోతో పొలిటికల్ మూవీ చేస్తున్నామని అన్నారు.
అంటే అది ప్రభాస్ తోనే అని టాక్ మొదలయింది. 2028 లో సినిమా మొదలుపెట్టి… ఎలక్షన్ టైం కి ఆ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ కనపడుతోంది. ఇప్పటి వరకు ప్రభాస్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయలేదు. రాజకీయాలకు సంబంధం లేకుండా తన సినిమాలు తాను చేసేస్తున్నాడు. ఇప్పుడు కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో పొలిటికల్ మూవీ ఏంటీ అనేది అర్ధం కావడం లేదు అంటున్నారు ఆడియన్స్, ఫ్యాన్స్. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే జనవరి వరకు ఎదురు చూడాలి.