Prabhas: 8 పార్ట్‌లుగా ప్రాజెక్ట్-K.. హాలీవుడ్ లెవెల్‌లో నాగ్ అశ్విన్ ప్లాన్ ?
500 కోట్ల భారీ బడ్జెట్‌తో నాగ్ అశ్విన్ ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్-K సినిమా గురించి ఇండస్ట్రీ షేక్ అయ్యే గాసిప్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమా తరువాత సేమ్ కాన్సెప్ట్‌తో 8 సిరీస్‌లు ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ నాగ్ అశ్విన్. వీటిలో మల్టీవర్స్ కూడా ప్లాన్ చేసే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. నిన్నటి వరకూ ప్రాజెక్ట్-K లో K అంటే కల్కీ అని అంతా అనుకున్నారు. కానీ అది కల్కీ కాదని.. కృష్ణ అని తెలుస్తోంది.
ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ బ్రహ్మ రోల్‌లో కనిపించనున్నట్టు సమాచారం. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే రీసెంట్‌గా ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా అమితాబ్ గాయపడ్డారు. బ్రహ్మ క్యారెక్టర్ చేస్తే ఆయనతో ఫైట్ సీన్స్ ఎందుకు చేస్తారంటూ కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. హీరో దేవుడి రోల్‌లో కనిపించి ఫైట్స్ చేయగా లేనిది.. బ్రహ్మ ఫైట్స్ చేస్తే తప్పేంటని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. అమితాబ్ క్యారెక్టర్ ఎలా ఉన్నా.. ఈ సినిమా తరువాత సేమ్ కాన్సెప్ట్‌తో 8 సినిమాలు రాబోతున్నాయనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ 8 సినిమాలను వేరు వేరు హీరోలతో ప్లాన్ చేస్తున్నాడట నాగ్ అశ్విన్. అన్ని సినిమాల్లో హీరో దేవుడి అవతారంగా ఉంటాడట. అప్పటి కాలాన్ని బట్టి, అప్పుటి ప్రజలకు వచ్చిన సమస్యల్ని బట్టి హీరో ఎంట్రీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కేవలం హాలీవుడ్‌లో మాత్రమే ఇలాంటి ప్రాజెక్ట్‌లు చూశాం. కానీ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌ను ఇండియన్ సినిమాలో నాగ్ అశ్విన్ ట్రై చేయబోతున్నట్టు తెలుస్తోంది.