Prabhas: క్లారిటీ లేదన్నవాళ్లకి.. ముఖం పగిలేలా ప్రభాస్ పంచ్..

ప్రభాస్ సినిమాలు విడుదల వాయిదా అన్నారు. సలార్ సెప్టెంబర్ రాకపోవచ్చు దసరాకన్నారు. ప్రాజెక్ట్ కే గ్రాఫిక్స్ పరంగా పనులు అవటానికి టైం పడుతుంది కాబట్టి సంక్రాంతికి కాదు, సమ్మర్ కి అని గుసగుసలొచ్చాయి. ఇలా ప్రభాస్ సినిమాల విడుదల తేదీల మీదే కామెంట్లు, యాంటీ ఫ్యాన్స్ కుట్ర పూరితమైన ట్రోలింగ్స్ పెరిగాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2023 | 09:45 PMLast Updated on: Mar 25, 2023 | 9:45 PM

Prabhas Punch

ఇప్పుడు ఈ కామెంట్లకు, కౌంటర్లకు, మొత్తం ట్రోలింగ్ కి పంచ్ ఇస్తున్నాడు ప్రభాస్. క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో తన సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ చేశాడు.నాలుగు సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ కాబోతున్నాయో డేట్లతో సహా తేలిపోయింది.

ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్, ప్రాజెక్ట్ కే ఈ నాలుగు మూవీల రిలీజ్ డేట్లు క్యాలెండర్ లో ఫిక్స్ అయ్యాయి. జూన్ 16 న ఆదిపురుష్ రావటం ఫైనల్ అయ్యింది. ఆడేట్ మారదని టీం తేల్చింది. ఇక సెప్టెంబర్ 28న సలార్ రావటంలో ఎలాంటి మార్పులేదట. సంక్రాంతికి అంటేజనవరి 12 కి ప్రాజెక్ట్ కే రిలీజ్ కూడా నాగ్ అశ్విన్ ఫిక్స్ చేశాడు. ఇదే కాదు మారుతి మేకింగ్ లో 100 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ చేస్తున్న రాజా డీలక్స్ కూడా మే 5 కి విడుదలని ఫిక్స్ చేసిందట ఫిల్మ్ టీం. ఇందుకు తగ్గట్టు సౌత్, నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ తో కూడా డీల్ ఓకే అయ్యిందట. అలా రిలీజ్ డేట్లు మారుతాయనే ప్రచారానికి ప్రభాస్ పంచ్ ఇచ్చేలా ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు.