Prabhas: అప్పుడే ఊపేస్తున్న రాజా సాబ్ మేనియా.. రాజా సాబ్.. హిట్టు ప‌క్కా..!

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న పాత్రలన్నీ కూడా చాలా లార్జ‌ర్ స్కేల్‌లో ఉంటున్నాయి. వాటికి త‌గ్గ‌ట్లే ప్ర‌భాస్‌కు సూటు, బూటు వేసి స్టైలిష్‌గా ప్ర‌జెంట్ చేస్తున్నారు. అయితే.. రీసెంట్‌గా లుంగీ ప‌ట్టుకొని రాజా సాబ్‌గా వ‌చ్చిన ప్ర‌భాస్ లుక్.. ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 19, 2024 | 01:10 PMLast Updated on: Jan 19, 2024 | 1:10 PM

Prabhas Rajasaab Movie Will Be A Blockbuster Director Maruti Taking Care Of It

Prabhas: సలార్‌తో సూపర్ హిట్ అందుకుని.. వ‌రుస భారీ ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. వ‌రుస యాక్ష‌న్ మూవీస్‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌.. చాలా రోజుల త‌ర్వాత మారుతి డైర‌క్ష‌న్‌లో వ‌స్తున్న రాజాసాబ్ మూవీలో డార్లింగ్ లుక్స్‌తో అద‌ర‌గొట్టాడు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ మూవీ టైటిల్ ఫ‌స్ట్ లుక్‌లో అసలు సిస‌లైన ప్ర‌భాస్ మాస్‌లుక్ క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న పాత్రలన్నీ కూడా చాలా లార్జ‌ర్ స్కేల్‌లో ఉంటున్నాయి.

TRIVIKRAM: మూడోసారి కూడా ముంచేశాడు.. త్రివిక్రమ్‌పై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం

వాటికి త‌గ్గ‌ట్లే ప్ర‌భాస్‌కు సూటు, బూటు వేసి స్టైలిష్‌గా ప్ర‌జెంట్ చేస్తున్నారు. అయితే.. రీసెంట్‌గా లుంగీ ప‌ట్టుకొని రాజా సాబ్‌గా వ‌చ్చిన ప్ర‌భాస్ లుక్.. ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించింది. ఈ సినిమా విషయంలో రెబల్ ఫ్యాన్స్ అంతా డబుల్ శాటిస్ఫై అయ్యేలా సినిమా చేస్తున్నాడట మారుతి. ఇక‌.. రాజా సాబ్ మూవీ కోసం మారుతి చాలా కేర్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా డైరెక్టర్ మారుతి తన సినిమాల్లో హీరో లుక్ మీద చాలా కేర్ తీసుకుంటారు. రాజా సాబ్ పోస్టర్‌లో ఈ కేర్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్ర‌భాస్‌లోని మాస్ మూమెంట్స్‌తో రాజా సాబ్ చేసి గ‌ట్టి హిట్ కొట్టాల‌ని మారుతి చాలా గ‌ట్టిగా ఫిక్స‌య్యాడ‌ట‌. ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాల‌కు కొద‌వ లేన‌ప్ప‌టికీ. మారుతి మార్క్ ఎంట‌ర్‌టైనింగ్ కూడా వేరే లెవ‌ల్‌లో ఉండేలా ప్లాన్ చేశాడ‌ట‌. సలార్ 1తో మాస్ హిట్ అందుకున్న ప్రభాస్.. రాజా సాబ్‌గా క‌చ్చితంగా ఫ్యాన్స్ కోరుకుంటున్న‌ ఎంటర్టైన్‌మెంట్ అందిస్తాడంటున్నారు మేక‌ర్స్‌.

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న‌వ‌న్నీ భారీ బ‌డ్జెట్ చిత్రాలే. అయితే రాజాసాబ్ మూవీ విష‌యంలో మాత్రం మారుతి పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తున్నాడ‌ట. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నిటిలో ఇదే తక్కువ బడ్జెట్ అట‌. రెమ్యునరేషన్‌లతో సంబంధం లేకుండా 60 కోట్లలోపే సినిమా పూర్తి చేస్తున్నారట. అందుకే ఇది కచ్చితంగా ప్రాఫిటబుల్ వెంచర్ అని మూవీ టీమ్ చెబుతోంది. ఈ సమ్మర్‌కి ప్రభాస్ కల్కి వస్తుండగా ఇయర్ ఎండింగ్‌కి రాజా సాబ్‌ని దించాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రాజా సాబ్ లెక్క చెప్పి మ‌రీ గ‌ట్టి హిట్ కొట్టేలా చేస్తున్న ప్లాన్ ఎలా వ‌ర్కువుట్ అవుద్దో చూడాలి.