Adipurush: నిర్మాతలను నిండా ముంచిన ఆదిపురుష్
ఆదిపురుష్.. విషయం కంటే వివాదమే ఎక్కువ ఉంది మూవీలో ! రామాయణంలా అనిపించినా.. అది రామాయణం కాదు అన్నది చాలా మంది విమర్శ.
మనం చూసిన రామాయణానికి, ఓం రౌత్ తీసిన రామాయణానికి అసలు సంబంధమే లేదని భగ్గుమంటున్నారు ఫ్యాన్స్ అంతా. ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. అయినా సరే మొదటి రెండు రోజులు కలెక్షన్స్ పర్వాలేదనిపించాయ్. మూడో నుంచి జనాలు థియేటర్ వైపు రావడమే మానేశారు. కొన్ని వర్గాల ఆందోళనలు, మరికొందరి విమర్శలు.. బాక్సాఫీస్ మీద తీవ్ర ప్రభావం చూపించాయ్. దీంతో కలెక్షన్స్ పడిపోవడం మొదలయ్యాయ్. మూవీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించడం మొదలైంది.
రాబోయే రోజుల్లో ఎన్ని కలెక్షన్లు వచ్చినా.. సినిమాను నష్టాల నుంచి బయటపడేయడం కష్టమే అన్నది ట్రేడ్ వర్గాల అంచనా. నార్త్ సంగతి వదిలేస్తే.. నైజాం, ఏపీలో ఆదిపురుష్ హక్కులను దక్కించుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి భారీ నష్టాలు తప్పేలా లేవు. రెండు ఏరియాలకు కలిపి 150 కోట్లకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు సంపాదించుకుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఐతే ఇంకా 30 కోట్లు కలెక్షన్లు రావాల్సి ఉంది. అది కూడా కష్టంగానే కనిపిస్తోంది.
బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. డిస్ట్రిబ్యూటర్ షేర్ కింద 120 కోట్లు రావాలి. ఐతే అది 73 కోట్ల దగ్గరే ఆగిపోయింది. రాబోయే రోజుల్లో ఎక్కువలో ఎక్కువ 15కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో 30 కోట్లు నష్టం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో నిర్మాతలు నిండా మునగడం ఖాయంగా మారింది. ఆదిపురుష్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు సంపాదించుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ప్రభాస్‌తో రెండు సినిమాలు ప్లాన్ చేస్తోంది.