Prabhas: ప్రభాస్ ఎక్కడ ఉన్నా రాజే.. ఫ్యాన్ కోసం ఏం చేశాడో తెలిస్తే ప్రాణం ఇస్తారు..
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు నిలువెత్తు నిదర్శనం మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇంత పెద్ద స్టార్ ఐనా ఇప్పటీకీ ఆయన పెద్దల దగ్గర చూపించే వినయం.. ఫ్యాన్స్ మీద చూపించే ప్రేమ ఎవరికీ సాధ్యం కానివి. డార్లింగ్ పర్సనాలిటీనే కాదు.. మనసు కూడా చాలా పెద్దది. ఇక దానధర్మాలు, అతిథ్యం ఇవ్వడంలో ప్రభాస్ నిజంగా రాజే.
ప్రభాస్‌తో పని చేసిన చాలా మంది యాక్టర్స్ చెప్పే మాట ఇది. ప్రభాస్ సినిమాలో పని చేస్తున్నారంటే రోజు వాళ్లకు ప్రభాస్ ఇంటి నుంచి విందు భోజనం రావాల్సిందే. అందుకే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రభాస్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఫ్యాన్స్ ప్రభాస్‌ను ఎంత లవ్ చేస్తారో ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్‌కు అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు.
వాళ్లను కలిసేందుకు చాలా ఇష్టపడతాడు. తన ఫ్యాన్ ఆఖరి కోరిక తీర్చేందుకు ప్రభాస్ చేసిన ఓ పని రీసెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రంజిత్ అనే ఓ ప్రభాస్ ఫ్యాన్ కొన్నేళ్ల క్రితం క్యాన్సర్‌తో చనిపోయాడు. తాను చనిపోతానని ముందే తెలియడంతో తన ఫేవరెట్ హీరో ప్రభాస్‌ను కలవడం తన ఆఖరి కోరిక అంటూ చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ స్వయంగా వాళ్ల ఫ్యామిలీని తన ఇంటికి ఇన్వైట్ చేశాడు. మంచి వింధు భోజనం ఏర్పాటు చేశాడు.
ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉండి కూడా రంజిత్‌తో 3 గంటలు గడిపాడు. ప్రభాస్ రంజిత్‌తో ఆప్యాయంగా మాట్లాడిన తీరును రంజిత్ తల్లిదండ్రులు ఇప్పటికే మర్చిపోలేదు. బాహుబలి సినిమాలో ప్రభాస్ వాడిన ఏదైనా వస్తువు తనకు ఇస్తారా అని రంజిత్ ప్రభాస్‌ను అడిగాడట. ఫ్యాన్ అలా కోరిక కోరాడో లేదో.. వెంటనే తాను బాహుబలి సినిమాలో వాడిన కత్తిని తెప్పించి రంజిత్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడట ప్రభాస్. ఆ కత్తి ఇప్పటికీ రంజిత్ ఇంట్లోనే ఉంది.
రంజిత్ తల్లిదండ్రులు ఈ విషయం గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రభాస్ గొప్ప మనసు తెలిసి.. నువ్వు దేవుడు సామీ అంటూ కామెంట్లు పెడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.