టాలీవుడ్ లో ప్రభాస్ డామినేషన్ వేరే లెవెల్. బాహుబలి సినిమా తర్వాత రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే రెబల్ ను తక్కువ అంచనా వేసిన వాళ్లకు అదే రేంజ్ లో ఆన్సర్ ఇచ్చాడు. ప్రభాస్ విషయంలో బాలీవుడ్ కి కూడా పక్కాగా బుద్ధి వచ్చింది. ఆది పురుష్ అనే సినిమాతో ప్రభాస్ ను ఇబ్బంది పెట్టాలని బాలీవుడ్ ప్లాన్ చేస్తే ఆ తర్వాత ఒక్కో సినిమాతో బాలీవుడ్ పీకలపై కాలేసి నుంచున్నాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే బాలీవుడ్ వాళ్లకు దినదిన గండం అన్నట్టుంది సినిమా. ప్రభాస్ సినిమా దెబ్బకు తమ సినిమాలు కూడా రిలీజ్ చేయాలంటే వణికి పోతున్నారు అక్కడ స్టార్ హీరోలు. ఇక ఆది పురుష్ సినిమాతో బాలీవుడ్ పై పగ పెంచుకున్నాడు రెబల్ స్టార్. అందుకే తన సినిమాల్లో బాలీవుడ్ స్టార్లు వద్దు అంటూ ఈమధ్య కొత్త కండిషన్ పెడుతున్నాడు. కల్కి సినిమా విషయంలో తప్పలేదు కాబట్టి పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు గానీ ఇప్పుడు మాత్రం ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది బాలీవుడ్ స్టార్లు తన సినిమాల్లో వద్దని ముఖం మీద చెప్పేస్తున్నాడు. తన సినిమాలకు తన ఇమేజ్ సరిపోతుందని వేరే వాళ్ళు ఇమేజ్ తాను కోరుకోవడం లేదని, అవసరమైతే హాలీవుడ్ నటులను అయినా తెచ్చుకుని తన సినిమాల్లో క్యారెక్టర్లు ఇచ్చుకోవచ్చని బాలీవుడ్ వాళ్లకు మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దని తేల్చేస్తున్నాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమాను లైన్లో పెట్టిన ప్రభాస్ ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్లకు అసలు ప్రయారిటీ ఇవ్వద్దు అనే విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. సందీప్ రెడ్డి వంగకు యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో మంచి ఇమేజ్ వచ్చింది. దీనితో అక్కడి స్టార్ యాక్టర్ ను స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రి రోల్ కు తీసుకోవాలని ముందు ప్లాన్ చేశాడు. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ కు ఒక పవర్ఫుల్ నెగిటివ్ రోల్ ఇవ్వాలని కూడా సందీప్ రెడ్డి కథ రాసుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రభాస్ కు చెప్తే ప్రభాస్ ఇచ్చిన ఆన్సర్ కు వంగ మైండ్ బ్లాక్ అయింది. ఆ రోల్ కు చాలా వెయిట్ ఉండటంతో అది బాబి అయితే బాగా చేస్తాడని కాబట్టి తాను బాబీని అనుకుంటున్నానని మీ ఒపీనియన్ చెప్పాలి అంటూ ప్రభాస్ ను అడిగాడట వంగ. అప్పటికే బాలీవుడ్ అంటే మంచి కాక మీద ఉన్న ప్రభాస్ బావిలేదు బొక్కలేదు మన తెలుగులో లేదంటే సౌత్లో మంచి స్టార్ యాక్టర్లు ఉన్నారని కాబట్టి ఇటువైపు చూడాలని తేల్చి చెప్పేసాడట. ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరూ బాలీవుడ్ స్టార్లను తీసుకున్నారని ఎక్కువ మంది వద్దని చెప్పడంతో సందీప్ రెడ్డి ఆ ప్లాన్ డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం మలయాళం స్టార్ హీరో మమ్ముట్టిని తీసుకునే ప్లాన్ చేస్తున్నాడు.[embed]https://www.youtube.com/watch?v=F_Nv03ninio[/embed]