ప్రభాస్ కు అంత కోపం ఏంటీ…? స్పిరిట్ విషయంలో ఎందుకంత సీరియస్

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. అసలు సినిమాలు హిట్ అయ్యే ఛాన్స్ లేదని భావించిన సమయంలో ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ పడింది కల్కీ రూపంలో. ఆ సినిమా బాలీవుడ్ కు కొత్త టార్గెట్ పెట్టింది. ఇక బాలీవుడ్ హీరోలు ఆ రికార్డు అందుకోవాలి అంటే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 22, 2024 | 07:48 PMLast Updated on: Sep 22, 2024 | 7:48 PM

Prabhas Reject Bollywood Actors In Spirit

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. అసలు సినిమాలు హిట్ అయ్యే ఛాన్స్ లేదని భావించిన సమయంలో ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ పడింది కల్కీ రూపంలో. ఆ సినిమా బాలీవుడ్ కు కొత్త టార్గెట్ పెట్టింది. ఇక బాలీవుడ్ హీరోలు ఆ రికార్డు అందుకోవాలి అంటే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. మల్టీ స్టారర్ సినిమా హాలీవుడ్ డైరెక్టర్ తో చేసినా ఆ రికార్డ్ బ్రేక్ చేయడం సాధ్యం కాదు అంటున్నారు. సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి ఫ్యాన్స్ కూడా శాక్క్ అయ్యారు. ఇక కల్కీ 2 కోసం కూడా జనాలు ఎదురు చూస్తున్నారు.

అక్కడి వరకు బాగానే ఉంది గాని… ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ పై చాలా సీరియస్ గా ఉన్నాడు అంటున్నారు జనాలు. ఆదిపురుష్ సినిమాతో తన పరువు తీయాలని తన క్రేజ్ తగ్గించాలని చూసిన బాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ ప్రభాస్ ముందుకు వెళ్తున్నాడు. తాను తర్వాత నటించబోయే సినిమాల్లో బాలీవుడ్ హీరోలు గాని విలన్లు గాని వద్దు అని చెప్తున్నాడట. కల్కీ సినిమాలో ఎప్పుడో అమితాబ్ ను సెలెక్ట్ చేసారు కాబట్టి ప్రభాస్ నో చెప్పలేకపోయాడు. కాని ఇప్పుడు రాజా సాబ్ లో గాని స్పిరిట్ సినిమాలో గాని అసలు బాలీవుడ్ వాళ్ళు వద్దని కోరుతున్నాడట.

స్పిరిట్ లో బాలీవుడ్ విలన్ ను తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగా భావించి… ప్రభాస్ కు చెప్పాడట. కాని వద్దంటే వద్దన్నాడట ప్రభాస్. బాలీవుడ్ మీద ఆధారపడటం తనకు ఇష్టం లేదని కావాలంటే హాలీవుడ్ విలన్ ను అయినా తీసుకోవాలని చెప్పాడట ప్రభాస్. ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ సమయంలోనే రాజా సాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. స్పిరిట్ ను వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక తన తర్వాతి సినిమాలు అన్నీ బాలీవుడ్ మీదనే ఫోకస్ చేసి రికార్డులు కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు.