SALAAR 2: సలార్ 2.. ఆ సినిమా కన్నా ముందే.. ప్రశాంత్ నీల్ ప్లాన్ ఇదే..!

ప్రశాంత్ నీల్ నిర్ణయం మ్యాన్ ఆఫ్ మాసెస్‌ని ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో మూవీ ప్లాన్ చేశాడు. తారక్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అలాంటిది తనతో సినిమా మొదలవ్వక ముందే సలార్ 2 అనేసరికి అంతా ఆశ్చర్య పడాల్సి వస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2024 | 04:58 PMLast Updated on: Jan 29, 2024 | 4:58 PM

Prabhas Salaar 2 Movie Shooting Will Be Start This Year Prasanth Neel Planning

SALAAR 2: సలార్ మూవీ వెయ్యికోట్ల కల నెరవేరకపోయినా రూ.730 కోట్ల వరకు వసూళ్లొచ్చాయి. అలా సంతోషపడుతున్న బ్యాచ్ ఇంకా హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఎందుకంటే వచ్చే ఏడాది మధ్యలో పట్టాలెక్కాల్సిన సలార్ సీక్వెల్‌ని ఈ ఏడాదే మొదలు పెడుతున్నాడు. ప్రశాంత్ నీల్ నిర్ణయం మ్యాన్ ఆఫ్ మాసెస్‌ని ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో మూవీ ప్లాన్ చేశాడు.

KALKI 2898 AD: కల్కి టీజర్.. అమెరికాలో రిలీజ్.. కారణం ఇదే..

తారక్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అలాంటిది తనతో సినిమా మొదలవ్వక ముందే సలార్ 2 అనేసరికి అంతా ఆశ్చర్య పడాల్సి వస్తోంది. ఐతే ఎన్టీఆర్ మాత్రం దేవర షూటింగ్ ఇంకా మే వరకు కొనసాగేలా ఉందని, మార్చ్‌లో 20 రోజులు హిందీ మూవీ వార్ 2 కోసం కేటాయించాడని తెలుస్తోంది. ఈ రెండింటితోనే ఈ ఏడాది గడిచేలా ఉంది. దీంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకంటే ముందే సలార్ 2ని పట్టాలెక్కించాలనుకుంటున్నాడట.

నవంబర్ రెండో వారం నుంచి సలార్ 2 షూటింగ్ అంటున్నారు. ఈలోపు కల్కి రిలీజవుతుంది. మారుతి మూవీ పూర్తవుతుంది. హనురాఘవ పూడి సినిమా సగం పైనే పూర్తవుతుంది. స్పిరిట్‌తోపాటు సలార్ 2ని ఒకేసారి తెరకెక్కించాల్సి వచ్చేలా ఉంది.