SALAAR 2: వచ్చే నెల నుంచే సలార్ 2 షూటింగ్.. ఇంత త్వరగా ఎందుకు..?

ఓవైపు ది రాజా సాబ్ షూటింగ్ ఇంకా 40 శాతం పెండింగ్ ఉంది. మరో వైపు హను రాఘవపూడి మూవీ ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక కల్కి మే 9 కాకుండా మే 30కి వాయిదా పడేలా ఉంది. ఈనెల 17న ఎనౌన్స్‌మెంట్ రాబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2024 | 05:40 PMLast Updated on: Apr 12, 2024 | 5:40 PM

Prabhas Salaar 2 Shooting Will Start From May Second Week

SALAAR 2: సలార్ 2 మే సెకండ్ వీక్ నుంచే సెట్స్ పైకెళ్లేలా ఉంది. ఆల్రెడీ సముద్రపు అలల్ని భారీ స్మిమ్మింగ్ పూల్‌లో సృష్టించేందకు కృత్రిమ బీచ్ సెట్‌ని రెడీ చేస్తున్నారు. అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓవైపు ది రాజా సాబ్ షూటింగ్ ఇంకా 40 శాతం పెండింగ్ ఉంది. మరో వైపు హను రాఘవపూడి మూవీ ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో సలార్ 2 సీక్వెల్‌ని అంత అర్జెంట్‌గా ఎందుకు పట్టాలెక్కిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.

PAWAN KALYAN: OG సెన్సేషన్.. ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్.. మరో ఖుషి అవుతుందా..?

ఇక కల్కి మే 9 కాకుండా మే 30కి వాయిదా పడేలా ఉంది. ఈనెల 17న ఎనౌన్స్‌మెంట్ రాబోతోంది. అలా చూసినా మే 30కి కల్కి వస్తే మే నెలంతా కల్కి ప్రమోషన్‌తోనే ప్రభాస్ బిజీ అవ్వాల్సి వస్తుంది. కాని ఇంతలో సలార్ 2 ని మే సెకండ్ వీక్ నుంచే మొదలు పెట్టేలా ప్లాన్ చేయటం అందర్నిఆశ్చర్య పరుస్తోంది. సలార్ ఎట్టిపరిస్థితుల్లో వచ్చే సమ్మర్‌లో రిలీజ్ చేయాలనేదే అసలు ప్లానట. సంక్రాంతికి రాజా సాబ్, సమ్మర్‌కి సలార్, ఇక 2025 దసరాకు హను రాఘవపూడి మూవీ విడుదలయ్యేలా ప్లానింగ్ జరుగుతోంది. అందుకే మే సెకండ్ వీక్ నుంచే సలార్ 2 షూటింగ్‌కి ప్రిపరేషన్లు జరుగుతున్నాయి. అయితే కల్కి ప్రమోషన్ పరిస్థితేంటనే డౌట్ రాకుండా ఉండదు.

నిజానికి మే రెండో వారమే సలార్ 2 షూటింగ్ మొదలవుతుంది, కాని షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ కాడు. జూన్ సెకండ్ వీక్ వరకు ప్రభాస్ సలార్ 2 షూటింగ్‌లో జాయిన్ కాడని తెలుస్తోంది. ఈలోపు ప్రభాస్ లేని సీన్లు, ముఖ్యంగా శృతి హాసన్ నటించే సీన్లు తెరకెక్కించబోతున్నారు.