Salaar Buzz: సలార్‌తో అట్లుంటది మరి.. ప్రభాస్ ఊచకోత.. బాక్సాఫీస్.. ఊపిరి పీల్చుకో..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు సలార్. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 23, 2023 | 04:27 PMLast Updated on: Aug 23, 2023 | 4:27 PM

Prabhas Salaar Hits Century In Us Box Office Even Before Its Release Find Out How

Salaar Buzz: బిగ్ స్క్రీన్‌పై డైనోసార్‌ను చూసే టైం వచ్చింది. సలార్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ మొదలైంది. పవర్ ఫుల్ ప్లేసెస్ మేక్ పవర్ ఫుల్ పీపుల్ అన్నట్లు గర్జనకు రెడీ అవుతోంది. బాక్సాఫీస్ బద్దలు అయ్యేలా.. బొమ్మ దద్దరిల్లేలా వచ్చేస్తోంది. అంచనాలను డబుల్ చేస్తూ సరికొత్త రికార్డులను కొల్లగొట్టేందుకు వచ్చేస్తోంది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు సలార్.

ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ ఫుల్‌ మాస్‌ మోడ్‌లో కనిపించబోతున్నాడు. కేజీఎఫ్‌ సినిమాలో యష్‌ను ఎంత వైలెంట్‌గా చూపించాడో ఈ సినిమాలో కూడా ప్రభాస్‌ను అంతే వైలెంట్‌గా చూపించబోతున్నాడు నీల్‌. పైగా జస్ట్ టీజర్‌తోనే అంచనాలు పెంచేయగా.. ఇప్పుడు సలార్ మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సలార్ మూవీకి జరుగుతున్న బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో దిమ్మతిరిగేలా ఉంది. ఈ సినిమా విడుదలకు ఇంకా ఐదు వారాల సమయం ఉండగానే యుఎస్‌లో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ షాక్‌కు గురి చేస్తున్నాయి.

బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే వేల టికెట్లు బుక్స్ కావడంతో ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థమవుతోంది. అంతేనా.. ఈ మూవీ ఐమ్యాక్స్ ఫార్మాట్లో అత్యధిక స్క్రీన్లపై రిలీజ్ అవుతుంటడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ‘సలార్’ ట్రైలర్ గురించి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మరి సలార్‌తో ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.