Salar Dialogues : సలార్ డైలాగ్స్.. ఎవడ్రా రాసింది.. (బిగ్ బాస్ రీతూ, సలార్ పోస్టర్)
ప్రభాస్ సలార్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్ మాస్ జాతర చూడడానికి ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. అయితే సలార్‌పై ఇప్పటికే చాలా మంది ప్రశంసలు కురిపించారు.
ప్రభాస్ సలార్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్ మాస్ జాతర చూడడానికి ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. అయితే సలార్‌పై ఇప్పటికే చాలా మంది ప్రశంసలు కురిపించారు. తాజాగా, బిగ్‌బాస్ గీతూ రాయల్ సలార్ రివ్యూ చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది. ‘‘నేను.. సలార్ బెనిఫిట్ షో చూశా.. చాలామంది ఎట్లుంది ఎట్లుంది అని అడుగుతున్నారు. ఈ సినిమా చూడకముందు ఫ్లాప్ అనుకున్నా.. సలార్ కూడా ఫ్లాపేలే అని అనిపించింది. కానీ సినిమా అయితే అద్దిరిపోయింది. ఆ స్టోరీ కానీ.. ఆ ట్విస్ట్‌లు కానీ.. ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్‌లు కానీ భయంకరంగా అనిపించింది. అని చెబుతూనే, ఫస్ట్ టైం చూస్తే సినిమా ఏం అర్థం కాదు. అంటూ, తన ఒపీనియన్ ని బయటపెట్టింది. ఎందుకంటే చాలా ట్విస్ట్‌లు ఉన్నాయి.. ఆ ఫ్లాట్ పాయింట్ కానీ.. డైలాగ్‌లూ ఎందుకు చెప్తున్నారో కూడా అర్ధం కాలేదు, బహుశా.. సెకండ్ టైం చూస్తే అర్ధం అవుతుంది. అంటూ సెలవిచ్చింది. ఈ విషయంపై ప్రభాస్ అభిమానులు పలు రకాలుగా స్పందిస్తూ, కామెంట్స్ పెడుతున్నారు.