SALAAR BIKE: సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్ కావాలా.. బంపర్ ఆఫర్

ఈ చిత్రంలో ప్రభాస్ వాడిన బైక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇంతకీ.. ఈ బైక్ గురించి ఇప్పుడెందుకూ అంటారా..? ఈ బైక్ మీరు సొంతం చేసుకోవచ్చు. సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్‌ గెలుచుకునే అవకాశం కల్పించనుంది స్టార్ మా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2024 | 08:41 PMLast Updated on: Apr 18, 2024 | 8:41 PM

Prabhas Salaar Movie Bumper Offer Fans Will Win Bike

SALAAR BIKE: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్. గత డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్‌కు బిగ్ హిట్ అందించింది. దాదాపు రూ.700 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ వాడిన బైక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

PUSHPA 2: పుష్ప 2 వరుస సర్‌ప్రైజ్‌లు.. త్వరలో టీజర్.. ఆ వెంటనే పాటలు..

ఇంతకీ.. ఈ బైక్ గురించి ఇప్పుడెందుకూ అంటారా..? ఈ బైక్ మీరు సొంతం చేసుకోవచ్చు. సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్‌ గెలుచుకునే అవకాశం కల్పించనుంది స్టార్ మా. ఈ చిత్రం ఏప్రిల్ 21, ఆదివారం రోజు స్టార్ మాలో ప్రీమియర్‌గా టెలికాస్ట్ కానుంది. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి టీవీలో ప్రసారమవుతుంది. టీవీలో ఈ సినిమా చూస్తూ బైక్ గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది స్టార్ మా. ఇంతకీ ఏం చేయాలంటే.. టీవీలో సినిమా ప్రసారమవుతున్నప్పుడు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సలార్ సినిమా చూడాలి. సినిమా ప్రసారమవుతున్నప్పుడు మధ్యలో బైక్ ఇమేజ్ లేదా బగ్ మధ్యమధ్యలో.. స్క్రీన్ ఎడమవైపు కనిపిస్తుంది. ఐదున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆ బైక్ స్క్రీన్‌పై ఎన్నిసార్లు కనిపిస్తుందో మెసేజ్ చేయాలి.

సలార్ మూవీ టీం అనౌన్స్ చేసిన 9222211199 నెంబర్‌కు సరైన ఆన్సర్ మెసేజ్ చేస్తే.. వారిలోంచి ఒకరిని ఎంపిక చేసి బైక్ అందిస్తారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎస్సెమ్మెస్ లైన్స్ ఓపెన్ ఉంటాయని మూవీ టీం వెల్లడించింది. పూర్తి వివరాలకు సలార్ మూవీ టీం, స్టార్ మా సోషల్ మీడియా పేజెస్‌ను విజిట్ చేయాలి. వారి సూచనలకు అనుగుణంగా ఫాలో అయి.. బైక్ గెలుచుకోవచ్చు.