రాజు రెబల్ మొండితనం… రాజాసాబ్ డైరెక్టర్ కు చుక్కలు
రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ విన్న ఎవరికి అయినా... కిరణ్ అబ్బవరం సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమా పరిశ్రమలో నిలబడటానికి... కిరణ్ అబ్బవరం అసలు గ్యాప్ లేకుండా ఏడాదికి ఆరు సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ విన్న ఎవరికి అయినా… కిరణ్ అబ్బవరం సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమా పరిశ్రమలో నిలబడటానికి… కిరణ్ అబ్బవరం అసలు గ్యాప్ లేకుండా ఏడాదికి ఆరు సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. నిర్మాతలు కూడా అతని సినిమాలకు పెట్టుబడి పెట్టేవారు. ఇప్పుడు ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే… చాలా మందికి కిరణ్ అబ్బవరం గుర్తుకు వస్తున్నాడు. 8 సినిమాలను లైన్ లో పెట్టడం చూసి షాక్ అవుతున్నారు. ఓ స్టార్ హీరో చేతిలో ఇన్ని సినిమాలు ఉండటం నిజంగా షాక్.
గతంలో ఎప్పుడో పాత హీరోలు అలా సినిమాలు చేసారు గాని ఇప్పుడు హీరోలు మాత్రం ఒక్కో సినిమా రిలీజ్ చేయడానికి ఏళ్ళ తరబడి తీసుకునే పరిస్థితి. కాని ప్రభాస్ మాత్రం ఆరు నెలలకు ఒక సినిమా చేయడానికి రెడీ కావడం చూసి జనాల మైండ్ బ్లాక్ అవుతోంది. ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలను ఓ టార్గెట్ పెట్టుకుని ఫినిష్ చేసి వచ్చే ఏడాది విడుదల చేస్తారని… ఆ తర్వాత కల్కీ 2 , స్పిరిట్ ఫినిష్ చేస్తాడని… ఆ తర్వాత సలార్ 2 సినిమా ఫినిష్ చేస్తాడని అందరూ ఊహించినా సీన్ రివర్స్ అవుతోంది.
ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సలార్ 2 సినిమాను ఇప్పుడే షూట్ స్టార్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో బిజీగా ఉండటంతో ఈ గ్యాప్ లో ప్రశాంత్ నీల్ సలార్ 2 సినిమాను ప్లాన్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ ఇప్పుడు మారుతిపై ఒత్తిడి పెంచుతున్నాడు అంటూ ఓ రూమర్ వైరల్ అవుతోంది. ది రాజాసాబ్ సినిమాలో ఇంకో 20 పర్సంట్ షూట్ చేస్తే ప్రభాస్ రోల్ కంప్లీట్ అవుతుంది. దీనితో అది డిసెంబర్ ఎండింగ్ లోపు ఫినిష్ చేస్తే… తాను ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 షూట్ చేసుకుంటా అని చెప్పాడట ప్రభాస్.
అది చూసి మారుతీ షాక్ అవుతున్నాడు. ఇంత ఫాస్ట్ గా సినిమా చేయడం కష్టం అని… తనకు జనవరి వరకు కావాలని చెప్తే… జనవరి ఫస్ట్ వీక్ వరకు టైం ఇచ్చాడట ప్రభాస్. దీనితో ఇతర నటులతో షూట్ ఆపేసి ఇప్పుడు ప్రభాస్ ఉన్న సీన్స్ ను ఫినిష్ చేస్తున్నాడు మారుతీ. ప్రభాస్ మొండితనం చూసి ఎదురు చెప్పలేక… సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఇచ్చేయడానికి రెడీ అవుతున్నాడు మారుతీ. త్వరలోనే రాజాసాబ్ నుంచి ఓ సాంగ్ కూడా రిలీజ్ చేయడానికి అవుతున్నారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చ్ ఎండింగ్ లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తారు.