నందమూరి అభిమానులకు ప్రభాస్ షాక్.. ఈ దెబ్బతో మోక్షజ్ఞ సైడ్ అయిపోయినట్టేగా..!

పెళ్లి చేసుకో స్వామి అంటే ఇదిగో ఈ సినిమా ఎదురుగా చేసుకుంటాను అంటూ.. అసలు గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2025 | 02:50 PMLast Updated on: Mar 06, 2025 | 2:50 PM

Prabhas Shocked Nandamuri Fans

పెళ్లి చేసుకో స్వామి అంటే ఇదిగో ఈ సినిమా ఎదురుగా చేసుకుంటాను అంటూ.. అసలు గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఈయన ఎప్పుడు ఏ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటాడు ఆయనకు కూడా క్లారిటీ లేదు. ఇండియాలో మరే హీరో చేయనంత వేగంగా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. తన దగ్గరికి ఏ దర్శకుడు వచ్చినా కూడా కేవలం 4 నెలలో షూటింగ్ పూర్తి చేయాలి అనేది ప్రభాస్ పెడుతున్న కండీషన్. స్క్రిప్ట్ వర్క్ ముందే పూర్తి చేసుకుని రండి.. బౌండర్ ఉంది కథ నచ్చితే వెంటనే డేట్స్ ఇస్తానంటున్నాడు రెబల్ స్టార్. అందుకే యంగ్ డైరెక్టర్స్ రెచ్చిపోతున్నారు. వాళ్లందరికీ ఇప్పుడు ఒకటే ధ్యేయం.. ప్రభాస్ కు నచ్చే కథ రాయడం.. ఆయనతో సినిమా చేయడం.

సుజీత్, రాధాకృష్ణ కుమార్, నాగ్ అశ్విన్ ఇలా చాలా మంది కుర్ర దర్శకులు ఇప్పటికే సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగ, మారుతి లాంటి దర్శకులు ప్రభాస్ తో సినిమాలు చేస్తున్నారు. ఇంతమంది లైన్ లో ఉండగానే తాజాగా మరో యంగ్ డైరెక్టర్ కూడా ప్రభాస్ తో సినిమా ఓకే చేయించుకున్నాడు. ఆయన ఎవరో కాదు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా ఈయన పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం రిషబ్ శెట్టి హీరోగా జై హనుమాన్ తెరకెక్కిస్తున్నాడు. దీంతోపాటే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యత కూడా తీసుకున్నాడు ప్రశాంత్. కానీ ఈ సినిమా అనుకున్న దాని కంటే ఇంకా ఆలస్యమైలా కనిపిస్తుంది.

అందుకే మిగిలిన సినిమాలతో బిజీ అవుతున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ కు కథ చెప్పి ఒప్పించాడు. నిజానికి బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో బ్రహ్మ రాక్షస్ సినిమా ప్లాన్ చేశాడు ప్రశాంత్ వర్మ. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. ఇదే కథను ఇప్పుడు ప్రభాస్ ఓకే చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు షూటింగ్ కూడా సైలెంట్ గా స్టార్ట్ చేసారు అని తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం నందమూరి అభిమానులకు ఇంతకంటే బ్యాడ్ న్యూస్ మరొకటి ఉండదు. ఎందుకంటే మోక్షజ్ఞ సినిమా ఇంకా లేట్ అవుతుంది కాబట్టి. ఎలా చూసుకున్నా కూడా ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ సినిమా రానట్టే.