దినమ్మ జీవితం ప్రభాస్ గాల్లో పాడితే.. నేల మీద సీనీ సునామే..

రెబల్ స్టార్ ప్రభాస్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో బాహుబలి, మిర్చీ, సలార్ లో ప్రూవ్ అయ్యింది. కామెడీ చేస్తే డార్లింగ్ నుంచి కల్కీలో ఫస్ట్ హాఫ్ వరకు బానే వర్కవుట్ అయ్యింది. మాస్ నుంచి రొమాంటిక్ కిక్ వరకు ప్రభాస్ కి అన్నీ కలిసొచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 19, 2024 | 08:26 PMLast Updated on: Nov 19, 2024 | 8:26 PM

Prabhas Sing A Song For Next Movie

రెబల్ స్టార్ ప్రభాస్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో బాహుబలి, మిర్చీ, సలార్ లో ప్రూవ్ అయ్యింది. కామెడీ చేస్తే డార్లింగ్ నుంచి కల్కీలో ఫస్ట్ హాఫ్ వరకు బానే వర్కవుట్ అయ్యింది. మాస్ నుంచి రొమాంటిక్ కిక్ వరకు ప్రభాస్ కి అన్నీ కలిసొచ్చాయి. ఫస్ట్ టైం హర్రర్ మూవీతో ది రాజా సాబ్ గా మారాడు. ఏప్రిల్ లో ఎటాక్ చేయబోతున్నాడు. అంత వరకు ఓకే కాని, అంతకు మించిన సర్ ప్రైజ్ ఇందులో తూటాలా పేలే పాటని కన్ఫామ్ చేశారు. ఆ పాట వింటే నార్త్ ఇండియాలో పూనకాలొస్తాయి… ఒకప్పుడు బాలీవుడ్ నే కాదు, ఉత్తర భారత దేశాన్ని గాల్లో తేలేలా చేసిందా సాంగ్. ఆ పాటే ఇప్పుడు ది రాజా సాబ్ మూవీలో తూటాలా మార్చేస్తున్నారు. అంతకు మించిన సర్ ప్రైజ్ ఏంటంటే ఆపాట స్వయాన ప్రభాసే పాడబోతున్నాడు. గొంతు సవరించబోతున్నాడు. అది కూడా తెలుగు, హిందీలో… మరి ఆ సంగతేంటో చూస్తారా… చూసేయండి..

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ హిట్ తర్వాత ది రాజా సాబ్ తో సమ్మర్ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ హను రాఘవపూడీ ఫౌజీ మూవీని కూడా చేస్తున్న తను, ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తో బిజీ అవుతాడు. ఆతర్వాతే సందీప్ రెడ్డి స్పిరిట్ మొదలౌతుంది…

ఇవన్నీ అంతా అనుకున్నట్టే షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. అయితే ఈలోపే గాలి లాంటి వార్తేమో అనుకునేలోపు, గాలిలో తుఫానే తీసుకొచ్చేలా ఉంది. అదే ది రాజా సాబ్ లో గాలి పాట, తూటాలా మారబోతోందని తేలింది.

ఈ పాటని ప్రభాసే తన గాత్రంతో పాడబోతున్నాడు. ఇంతవరకు రెబల్ స్టార్ ఎన్నడూ పాట పాడింది లేదు. ఆ ప్రయత్నం చేసింది లేదు. కాని ఈసారి తెలుగుతోపాటు, హిందీలో కూడా గాలి పాట పాడేందుకు రెడీ అయ్యాడు..

తన కెరీర్ లోనే ఫస్ట్ టైం హర్రర్ మూవీచేస్తున్న రెబల్ స్టార్, ఫస్ట్ టైం పాట పాడటం కూడా జరగబోతోంది. అయితే ఆ పాటకి నార్త్ ఇండియాకో ఎమోషనల్ కనెక్షణ్ ఉంది… ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు, కజకిస్తాన్ నుంచి కిర్గిస్థాన్ వరకు ఈ పాటకో స్పెషాలిటి ఉంది. ఆల్రెడి దశాబ్దాల క్రితమే మిడిల్ ఈస్ట్ నుంచి నార్త్ ఇండియా వరకు ట్రెండ్ సెట్ చేసిన హవా హవా సాంగ్ ని ది రాజా సాబ్ మూవీలోరీమిక్స్ చేయబోతున్నారు

బేసిగ్గా ఓపాకిస్థాని సింగర్ వల్ల ఆ పాట నార్త్ ఇండియాలో కూడా ఫేమస్ అయ్యింది. కాని ఆ పాట ఒరిజినల్ నిజానికి ఇరాన్ కు చెందింది. ఇరానీ సాంగ్ లిరిక్స్ తోపాటు పాటని ఉర్దూ కమ్ హిందీలో సెట్ చేసి అప్పట్లో ట్రెండ్ సెట్ చేశారు. ఎయిటీస్ లో వచ్చిన ఈ పాట, బాలీవుడ్ నే కాదు ఆఫ్ఘనిస్తాన్ వరకు పాపులరైంది. ఒరిజినల్ ఇరాన్ సాంగే అయినా, వాళ్లని కూడా ఎట్రాక్ట్ చేసింది ఈ పాట.. అలాంటి ఈ పాటని ది రాజా సాబ్ లోరీమిక్స్ చేయటమే కాదు, ప్రభాస్ తో పాడించబోతున్నారనగానే… నార్త్ లో పూనకాలు కన్ఫామ్ అయ్యాయనే మాటలే వినిపిస్తున్నాయి

ఆ పాటకి అంత రీచ్ ఉంది.. అలాంటి సాంగ్ ని పాన్ ఇండియా కింగ్ చేసే ది రాజా సాబ్ లో వాడితే, అదో ట్రెండ్ సెట్టరౌతుంది… మొత్తానికి ఆ ప్రయత్నంలోనే ఎంటైర్ రాజా సాబ్ టీం బిజీ అయ్యింది.