సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ప్రభాస్ స్పిరిట్ ఫైట్ సీక్వెన్స్.. పవర్ ఫుల్ సీన్స్ ప్లాన్

పాన్ ఇండియా స్టార్ గా దుమ్ము రేపుతున్న రెబల్ స్టార్ ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. వరుస భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ ఎప్పుడు ఏ సినిమా అనౌన్స్ చేస్తాడో.. ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ చేస్తాడో అర్థం కాక ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2025 | 08:30 PMLast Updated on: Jan 25, 2025 | 8:30 PM

Prabhas Spirit Fight Sequence In Sydney Cricket Ground Powerful Scenes Plan

పాన్ ఇండియా స్టార్ గా దుమ్ము రేపుతున్న రెబల్ స్టార్ ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. వరుస భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ ఎప్పుడు ఏ సినిమా అనౌన్స్ చేస్తాడో.. ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ చేస్తాడో అర్థం కాక ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. బాహుబలి టైంలో వచ్చిన గ్యాప్ ను ఎలాగైనా సరే కవర్ చేసి ఆరు నెలలకు ఒక సినిమా కచ్చితంగా రిలీజ్ చేయాలని పక్కా కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నాడు ప్రభాస్. అందుకే ఇప్పుడు ప్రభాస్ చేతులో ఎనిమిది సినిమాలు ఉన్నాయి.

ఈ 8 సినిమాలను రాబోయే మూడు నాలుగేళ్లలో రిలీజ్ చేసేయాలని టైం వేస్ట్ చేయొద్దని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ఇది రాజా సాబ్ అనే సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక సినిమా కంప్లీట్ చేస్తాడు. ఆ సినిమా తర్వాత స్పిరిట్ చేస్తాడా సలార్ సినిమా చేస్తాడా అనేది క్లారిటీ రావడం లేదు. సలార్ సీక్వెల్ విషయంలో ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. అటు కల్కి పార్ట్ 2 విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. ఇక ఇదే టైంలో స్పిరిట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి.

లేటెస్ట్ గా వచ్చిన ఒక క్రేజీ అప్డేట్ చూస్తే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ.. యానిమల్ సినిమాతో తాను ఎంత వైలెంట్ డైరెక్టర్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ ని కూడా అంతకుమించి వైలెంట్ రోల్ లో చూపించేందుకు రెడీ అవుతున్నట్లు క్లారిటీ వస్తోంది. స్పిరిట్ లో ప్రభాస్ ను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చూపించేందుకు ఇప్పటికే కథ రెడీ చేశాడు. ఇక మ్యూజిక్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేసి మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా మూవీ షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. ఈ మూవీ తొలి షెడ్యూల్ ను ఇండోనేషియాలో స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో కూడా ఈ సినిమా షూటింగ్ ఉంటుంది. ప్రస్తుతం ఇండోనేషియా రాజధాని జకార్తా లో షూటింగ్ చేస్తారని టాక్ వస్తుంది. ఈ సినిమాలోని కొన్ని పోలీస్ సీన్స్ ను ఇక్కడే షూట్ చేస్తారట. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లే సిడ్నీలో కొంత షూటింగ్ జరుగుతుంది. అక్కడే ఒక సాంగ్ ను కూడా షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఒక క్రికెట్ మ్యాచ్ జరిగే టైంలో ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేసారు. ఇక ఈ సినిమాలో విలన్ గా వరుణ్ తేజ్ ను ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది.