PRABHAS SPIRIT: డబ్బుతో విష ప్రచారం.. స్పిరిట్ దెయ్యాల సినిమా కాదు..

రెబల్ స్టార్ మూవీ మీద అంత రూమర్లతో విషం కక్కడానికి చాలా కారణాలున్నాయి. ఒకటి యానిమల్ మూవీ నచ్చని బ్యాచు అయితే, రెండోది సందీప్ అంటే మండిపడే బాలీవుడ్ బ్యాచ్. ఇలా తన మీద కోపాన్ని స్పిరిట్ మూవీ మీద విష ప్రచారంతో చూపిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 29, 2024 | 05:18 PMLast Updated on: Feb 29, 2024 | 5:18 PM

Prabhas Spirit Movie Getting Negative Publicity Spreading By Bollywood Mafia

PRABHAS SPIRIT: రెబల్ స్టార్ ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్. పక్కా పోలీస్ మూవీ అని ఎప్పుడో ఎనౌన్స్ చేశాడు సందీప్. అయినా ఇదో హర్రర్ మూవీ అని విష ప్రచారం పెంచారు కొందరు. టైటిల్లో స్పిరిట్ అని ఉందంటే, ఆత్మలు.. ప్రేతాత్మలని రూమర్స్ స్ర్పెడ్ చేస్తున్నారు. కానీ, స్పోర్టింగ్ స్పిరిట్‌లాగానే స్పిరిట్ మూవీ ప్రేరణనిచ్చే ఓ పోలీస్ కథ అని సందీప్ తేల్చాడు. అయినా రెబల్ స్టార్ మూవీ మీద అంత రూమర్లతో విషం కక్కడానికి చాలా కారణాలున్నాయి.

Samantha Ruth Prabhu: సైకిల్‌ గుర్తుకు ఓటేయాలంటున్న సమంత.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో..

ఒకటి యానిమల్ మూవీ నచ్చని బ్యాచు అయితే, రెండోది సందీప్ అంటే మండిపడే బాలీవుడ్ బ్యాచ్. ఇలా తన మీద కోపాన్ని స్పిరిట్ మూవీ మీద విష ప్రచారంతో చూపిస్తున్నారు. మరొక కారణం అసూయ. నిజమే రెబల్ స్టార్ అంటే అందరి డార్లింగ్ అని అంతా అన్నా, తనంటే కుల్లుకు చచ్చే బ్యాచ్ కూడా ఇండస్ట్రీలో లేకపోలేదు. ప్రజెంట్ టాలీవుడ్‌లో సీన్ ఎలా ఉందంటే, ఏ సినిమా వచ్చినా, దానికి ప్రమోషన్ పెంచేందుకు డబ్బా కొట్టించే వీడియోలు సోషల్ మీడియాలో డబ్బిచ్చి పెట్టించటం కామన్. కొందరైతే నెగెటివ్ మీమ్స్‌ని తమ సినిమా మీద తామే రెడీ చేయించి అలా కూడా ప్రమోషన్ పెంచేసుకుంటున్నారు.

ఇంకొందరైతే, కావాలని పక్క వాళ్ల సినిమాల మీద ట్రోలింగ్‌కి డబ్బులిచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నారట. బాలీవుడ్‌లో కొన్ని గ్రూపులు సౌత్ హీరోల మీద, ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ మీద ఇలాంటి నెగెటిట్ ట్రోలింగ్ చేయిస్తున్నారు. డబ్బులిచ్చి మరీ విషం చిమ్ముతున్నారనే అనుమానాలు, భారీగా పెరిగాయి. సమయం సందర్భం లేకుండా ప్రభాస్ మూవీని టార్గెట్ చేయటమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు.