PRABHAS SPIRIT: ప్రభాస్ మీద పుకార్ల దెబ్బలకు స్పిరిట్ రాస్తున్నాడా..?

స్పిరిట్‌ని అక్టోబర్‌లో మొదలు పెడుతానని తేల్చాడు సందీప్ రెడ్డి వంగ. కాని నవంబర్‌లో దీపావళికి ఈసినిమా లాంచ్ అవుతుందని రూమర్స్ పెరిగాయి. అంతేకాదు ఈ సినిమా మీద భారీగా ప్రెజర్ పెంచేస్తున్నాడు యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2024 | 08:17 PMLast Updated on: Apr 22, 2024 | 8:17 PM

Prabhas Spirit Movie Will Launch In October Said Director Sandeepreddy Vanga

PRABHAS SPIRIT: రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి నుంచి వచ్చిన అమితాబ్ ప్రోమో పేలింది. వచ్చే సోమవారం దీపికా పదుకొనే పాత్ర, ఆ తర్వాత సోమవారం కమల్ హాసన్ పాత్రలకు సంబంధించిన ప్రోమోలు రాబోతున్నాయి. ఈ సినిమా ప్రోమోస్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇంకా సెట్స్‌పైకెళ్లని స్పిరిట్ మూవీ మీద రూమర్స్ పెరిగాయి.

KALKI 2898 AD: కల్కి అమితాబ్‌ యంగ్‌ లుక్‌పై రచ్చ.. కొరటాల తప్పే నాగి చేస్తున్నాడా ?

మొన్నీ మధ్యే పొట్టేల్ టీజర్ లాంచ్ చేస్తున్నప్పుడు స్పిరిట్‌ని అక్టోబర్‌లో మొదలు పెడుతానని తేల్చాడు సందీప్ రెడ్డి వంగ. కాని నవంబర్‌లో దీపావళికి ఈసినిమా లాంచ్ అవుతుందని రూమర్స్ పెరిగాయి. అంతేకాదు ఈ సినిమా మీద భారీగా ప్రెజర్ పెంచేస్తున్నాడు యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్. 2026 జనవరిలో యానిమల్ సీక్వెల్ యానిమల్ 2 ఉంటుందని, అది మొదటి భాగం కంటే వయొలెంట్‌గా ఉంటుందని తేల్చాడు. కారణం.. ఈ సినిమా కథ రెడీ అవటమే. 2026లో తెరకెక్కే యానిమల్ 2 కథ రెడీ అయ్యింది కాని, స్పిరిట్ కథ ఇంత వరకు రెడీ కాలేదు. అంతేకాదు అక్టోబర్‌లోగా స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేయాలని సందీప్ రెడ్డి వంగ టార్గెట్ పెట్టుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఒక వైపు స్పిరిట్‌లో హీరోయిన్‌గా మొదట్లో త్రుప్తి దిమ్రీ అన్నారు. తర్వాత కాదు రష్మికను కంటిన్యూ చేస్తాడన్నారు. కాని అసలు కథే పూర్తికాలేదు. ఇంకా జోడీ కన్ఫామ్ చేయటం అంటే అది రూమరే అవుతుంది. ఇలా హీరోయిన్ పాత్రలు, లాంచింగ్ డేట్లు, దీనికి తోడు సలార్2 సెట్స్‌పైకెళితే స్పిరిట్ ఆగి, యానిమల్ 2 అక్టోబర్‌లో మొదలవ్వొచ్చనే ప్రచారం పెరిగింది. కాని వీటికి మాత్రం సందీప్ రెడ్డి వంగ బ్రేక్ వేయలేకపోతున్నారు. తను స్పిరిట్ లాంచింగ్‌తో పాటు కాస్ట్ అండ్ క్రూ ప్రకటించే వరకు ఈ రూమర్స్‌కి బ్రేక్ పడే పరిస్థితి లేదు.