Om Raut: ఓం రౌత్‌ను మళ్లీ ఆడుకుంటున్న ట్రోలర్స్.. రాముణ్ణి జీసస్‌ను చేశావ్ కదయ్యా..
ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ను ఫ్యాన్స్ మళ్లీ ఆడుకుంటున్నారు. అలా ఫస్ట్ షో కంప్లీట్ అయ్యిందో లేదో.. ఇలా వందల కొద్దీ మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఓం రౌత్‌ను టార్గెట్ చేస్తూ వందల పోస్టులు సోషల్ మీడియాలో సునామీ సృస్టించాయి. సినిమాలో ఉన్న అన్ని మిస్టేక్స్ ఒక ఎత్తైతే.. రాముడు వనవాసానికి వెళ్లేముందు దశరతుడితో మాట్లాడుతున్న వేసుకున్న గెటప్ ఒకెత్తు. వైట్ డ్రెస్‌లో ఉన్న ఈ గెటప్‌లో ప్రభాస్‌ను చూపి ఫ్యాన్స్ చిర్రెత్తిపోయారు.

Prabhas starrer Adipurush directed by Om Raut flopped, fans are trolling the director.
ఇదేంట్రా అచ్చూ జీసస్‌లా ఉన్నాడు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక హనుమాన్‌కు ఈ సినిమాలో మీసాలు ఉండవు కేవలం గడ్డం మాత్రమే ఉంటుంది. రామ భక్తుడైన హనుమంతుడిని ముస్లింలా చూపించావంటూ డైరెక్టర్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ ఐనప్పుడు కూడా ఇదే సీన్ కనిపించింది. క్యారెక్టర్స్ విషయంలో గెటప్స్ విషయంలో చాలా ట్రోలింగ్ వచ్చింది. సినిమా చూశాక మాట్లాడండి అంటూ మేకర్స్ సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఎవరూ వినలేదు. దీంతో తరువాత రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ విషయంలో చాలా మార్పులు చేశారు.
ఆ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త ట్రైలర్స్ ఉన్నట్టుగానే సినిమా మొత్తం ఉంటుంది అనుకున్నారు. కానీ తీరా సినిమాకు వెళ్తే.. ఫస్ట్ ట్రైలర్ ఎలా ఉందో సినిమా కూడా అలాగే ఉంది. కొన్ని సీన్స్‌లో మార్పులు చేసినా.. గ్రాఫిక్స్ విషయంలో తేడా ఈజీగా కనిపించింది. ఇక అన్నటికంటే మించి రావణుడి 10 తలలు వరుసగా కాకుండా బిల్డింగ్ కట్టినట్టు పైన 5, కింద 5 పెట్టడాన్ని ఫ్యాన్స్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. 500 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశావయ్యా అంటూ ఓం రౌత్‌ను ఓ రేంజ్‌లో వేసుకుంటున్నారు. ప్రభాస్ కటౌట్‌కు.. నువ్ వేయించిన గెటప్‌కు ఏమైనా సంబంధం ఉందా క్వశ్చన్ చేస్తున్నారు. ట్రైలర్ ట్రోలింగ్‌ను కవర్ చేసుకున్న ఓం రౌత్.. దీన్ని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి.