Adipurush: రెండో రోజు రెండు వందల కోట్లు.. కొనసాగుతోన్న ఆదిపురుష్‌ హవా

ఆదిపురుష్‌.. ఇప్పుడు సినిమా లవర్స్‌.. ఇండస్ట్రీ ప్రముఖులు అంతా మాట్లాడుకుంటున్న మాట ఇదే. డివైడ్ టాక్ వచ్చినా.. ఇదేం రామాయణం అని నుదురు విరిచినా.. బాక్సాఫీస్‌ దగ్గర ఆదిపురుష్ ఊచకోత మాత్రం ఆగడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 18, 2023 | 02:01 PMLast Updated on: Jun 18, 2023 | 2:01 PM

Prabhas Starrer Film Aadipurush Still Has Record Collections On Its Second Day

సినిమాలో మైనస్‌లు ఉన్నా మాట నిజమే అయినా.. ప్రభాస్‌ను రాముడిగా బిగ్‌స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్‌ క్యూ కడుతున్నారు. టాక్ సంబంధం లేకుండా కలెక్షన్స్‌ దూసుకుపోతున్నాయ్. ఆదిపురుష్ మూవీకి దాదాపు అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. ఐనా సరే మొదటి రోజు భారీ స్థాయిలో వసూళ్లు దక్కాయ్ మూవీకి. ఫస్డ్‌ డే వాల్డ్‌వైడ్‌గా ఏకంగా 140 కోట్లు రూపాయల గ్రాస్‌ రాబట్టిందీ మూవీ. రెండోరోజూ కూడా బాగానే హోల్డ్ చేసింది.

దీంతో డీసెంట్ నెంబర్లను రాబట్టి మరికొన్ని రికార్డులు బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్‌కు రెండో రోజు మంచి రెస్పాన్స్‌ దక్కింది. దీంతో 15.04 కోట్లు షేర్.. 24.85 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. దీంతో నాన్ ట్రిపుల్ఆర్‌ రికార్డును క్రియేట్ చేసింది. ఇక రెండు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 48 కోట్ల కోట్లు షేర్ రాగా.. 74 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్ చేసింది. తమిళంలో కోటి రూపాయలు.. కర్నాటకలో 7 కోట్లు.. కేరళలో 42 లక్షలు.. హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 35 కోట్లు.. ఓవర్సీస్‌లో 16 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందీ మూవీ. ఇలా వాల్డ్‌వైడ్‌గా రెండు రోజుల్లో 108 కోట్ల షేర్‌ రాగా.. 214 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందీ మూవీ. భారీ హైప్ క్రియేట్ చేసిన ఆదిపురుష్ చిత్రానికి.. ప్రపంచవ్యాప్తంగా 240 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రం 242 కోట్లు షేర్ వసూలు చేస్తే హిట్ అవుతుంది.