Project K: ఈనెల 20న ప్రాజెక్ట్ కె టీజర్.. ప్రభాస్ కి హాలీవుడ్ సపోర్ట్..
సలార్ టీజర్ ఇచ్చిన కిక్కుతో ఫుల్ జోష్ మీదున్న ఫ్యాన్స్ కి, ప్రాజెక్ట్ కే టీం సర్ ప్రైజ్ ఇస్తోంది. ఈనెల 20కి ప్రభాస్ ఫ్యాన్స్ గల్లా ఎగరేసే రోజుగా మారబోతోంది. ప్రాజెక్ట్ కే టైటిల్ తోపాటు టీజర్ కూడా ఈనెల 20నే రాబోతోందట. టీజర్ రాకముందే ఒక రికార్డ్ క్రియేట్ అయ్యిందట.

Prabhas starrer Nag Ashwin's Project K titled, Glimpses is known to be released at the Comic Con event
సలార్ టీజర్ ఎంతగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చిందో, అంతకు మించి కిక్ ని షాక్ లా ఇస్తోంది ప్రాజెక్ట్ కే టీం. యూఎస్ లో ఈనెల 20 న జరిగే కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కే టైటిల్ ని, గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారట. అంతేకాదు కామిక్ బుక్స్ లో సూపర్ హీరో లంటే ఇప్పటి వరకు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇలా అంతా అమెరికా హీరోలే.
కాని ఫస్ట్ టైం వరల్డ్ ప్లాట్ ఫాంలో ఇండియా నుంచి ఓ సూపర్ హీరోని పరిచయం చేయబోతోంది నాగ్ అశ్విన్ టీం. ఇండియా అంటేనే కథలకు, సినిమాలకు నిలయం, ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పబోతున్నాం అంటూ ప్రాజెక్ట్ కే టీం ఎనౌన్స్ చేసింది.
ఇండియా నుంచి ఫస్ట్ టైం ఓ సినిమా అమెరికన్ కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొంటోంది అంటే అది ప్రాజెక్ట్ కే నే. ఆల్రెడీ ప్రాజెక్ట్ కే టీం ఇందులో హీరో తాలూకు లుక్ ని కామిక్ లవర్స్ కోసం రెడీ చేసి రివీల్ చేసింది. ఇక ఈనెల 20న సినిమా టైటిల్ ని, అలానే హీరో పేరుని, అలానే గ్లింప్స్ ని రివీల్ చేయబోతోంది. సో 7న సలార్ టీజర్ వచ్చింది. రెండు వారాల గ్యాప్ లో ప్రాజెక్ట్ కే గ్లింప్స్ రాబోతోంది. ఇదంతా చూస్తే ఈ సర్ ప్రైజ్ లతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కేలా ఉంది.