1850 కోట్లకి చెక్ పెట్టే టైం వచ్చింది… 2027, 2028లో సినీ సునామీ…

ఎగ్జాక్ట్ గా పదేళ్ల క్రితం బాహుబలితో సౌత్, నార్త్ మధ్య అడ్డుగోడల్ని కూల్చాడు డైరెక్టర్ రాజమౌళి. అలా బాహుబలి మూవీ దేశాన్ని కుదిపేసింది. రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ గా మార్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 3, 2025 | 07:17 PMLast Updated on: Jan 03, 2025 | 7:17 PM

Prabhas Target Pan India In Upcomming Years

ఎగ్జాక్ట్ గా పదేళ్ల క్రితం బాహుబలితో సౌత్, నార్త్ మధ్య అడ్డుగోడల్ని కూల్చాడు డైరెక్టర్ రాజమౌళి. అలా బాహుబలి మూవీ దేశాన్ని కుదిపేసింది. రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ గా మార్చింది. కట్ చేస్తే మళ్ళీ అలాంటి సీన్ ఇప్పటి వరకు రిపీట్ కాలేదు. మద్యలో కేజీయఫ్ లు, త్రిబుల్ ఆర్ లాంటి హిట్లు పడ్డాయి. కల్కీ, పుష్ప లాంటి క్రేజీ ప్రాజెక్టులు పాన్ ఇండియాని షేక్ చేశాయి.. కాని బాహుబలిలా పాన్ ఇండియా మార్కెట్ లో ఓ కుదుపుని, మార్పుని తీసుకురాలేకపోయాయి. ఐతే పదేళ్లు గడిచింది.. ఇప్పుడు మరో మైలురాయిని విసిరి, మరో ట్రెండ్ సెట్ చేసే టైం దగ్గరకొచ్చినట్టుంది. అందుకే రాజమౌళి మళ్లీ పదేళ్ల తర్వాత మరోసారి రెండు భాగాల బల ప్రయోగాలు సిద్దం చేస్తున్నాడు. త్రిబుల్ ఆర్ తో దాడి చేసినట్టు ఒక మూవీతో కాకుండా, మళ్లీ బాహుబలి 1, బాహుబలి 2 లానే ఈసారి కూడా భారీగానే ఎటాక్ చేయబోతున్నాడు. మొత్తానికి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్లాన్ చేసిన సినిమా… రెండు బాగాలని డిసైడ్ చేశాడు.. మొన్నటి వరకు గాసిప్పే అయిన ఈ మాట ఇప్పుడు నిజమైంది. రిలీడేట్ల కంటే ముందు రిలీజ్ అయ్యే ఇయర్ల నెంబర్స్ తో ఇండియా షేక్ అయ్యేలా ఉంది.

బాహుబలి రాకముందు కూడా పాన్ ఇండియా ట్రెండ్ ఉండొచ్చు కాని, రాజమౌళి పుణ్యమాని, బాలీవుడ్ బౌండరీస్ బద్దలైంది బాహుబలితోనే… బాహుబలి 2 రిలీజ్ కి ముందు వరకు కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడన్న ప్రశ్న నార్త్ ఇండియాలో ఓ వేవ్ ని క్రియేట్ చేసింది. ఓ తెలుగు సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూసేలా చేసింది..

ఇలాంటివి మరే పాన్ ఇండియా మూవీలకు జరగలేదు. బాహుబలి రెండు బాగాలు సౌత్, నార్త్ సినిమాల మార్కెట్ మధ్య గ్యాప్ నీ చెరిపేశాయి. ట్రెండ్ సెట్ చేశాయి. ఆ దారిలో నడిచే కేజీయఫ్, పుష్ప, సలార్, కల్కీ, పొన్నియన్ సెల్వం ఇలా డజన్ల కొద్ది పాన్ ఇండియా ప్రయోగాలొచ్చాయి. నార్త్ మార్కెట్ ని క్యాష్ చేసుకునే ప్రయోగాలు జరిగాయి

తర్వాత త్రిబుల్ ఆర్ తో పాన్ వరల్డ్ మార్కెట్ అని చెప్పలేం కాని, గ్లోబల్ గా మాత్రం ఇండియన్ సినిమా మీద అందరి కన్నుపడేలా ,చేశాడు రాజమౌళి. కట్ చేస్తే నెక్ట్స్ లెవల్ కి వెళ్లే పనిలో ఉన్న తను, బాహుబలి తో ట్రెండ్ సెట్ చేసి పదేళ్లౌతున్న సందర్భంలో, ఇక పాన్ వరల్డ్ ని షేక్ చేసే పనిలో బిజీ అయ్యాడు

బేసిగ్గా బ్లాక్ బస్టర్లు, హిట్లతో పోలిస్తే చరిత్రని స్రుష్టించే సినిమాలకు కొంత టైం పడుతుంది. పాన్ ఇండియా మార్కెట్ ని, ట్రెండ్ ని సెట్ చేసినంత ఈజీగా, పాన్ వరల్డ్ మార్కెట్ ని క్యాప్చర్ చేయటం తేలిక కాదు. అలాని అదేం అసాధ్యం కూడా కాదు. చిన్న దేశం దక్షిన కొరియా అందుకు మంచి ఉదాహరణ. చిన్న మార్కెట్ అయినా కొరియన్ మూవీలు, సీరీస్ లు వరల్డ్ వైడ్ గా ఫేమస్ కాబట్టి, తెలుగు సినిమా పాన్ వరల్డ్ మార్కెట్ ని క్యాప్చర్ చేయటం అసాధ్యమేమి కాదు

అందుకే మహేశ్ బాబు తో తను తీసే సినిమాని 1000 కోట్లతో రెండు భాగాలుగా ప్లాన్ చేశాడట. ఆల్రెడీ హాలీవుడ్ లో సెటిలైన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా, అలానే ఇండోనేషియా లేడీ చెల్సియా తోపాటు హాలీవుడ్ హీరో క్రిస్ హోమ్ వర్త్ ని కూడా తీసుకుని, చాలా పెద్దగానే ప్రాజెక్టుని ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. అది కూడా రెండు భాగాలుగా… బేసిగ్గా రెండు బాగాలతో బాహుబలి మూవీ తీసి ట్రెండ్ సెట్ చేసిన జక్కన్న,మళ్లీ రెండు భాగాలతో పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసే పనిలో ఉన్నాడు. బాహుబలి వచ్చి పదేళ్లు అవుతుండటంతో సో మళ్లీ ట్రెండ్ మార్చే దశాద్ధం షురూ అనేస్తున్నారు. 1850 కోట్ల వసూళ్లని మించేలా 5 వేల కోట్ల మార్కెట్ కి ఎసరు పెడుతున్నాడు రాజమౌలి. 2027 లో మహేశ్ బాబు మూవీ మొదటి భాగం, 2028 లో రెండో భాగం వచ్చే లా ప్లాన్ చేశారు. సో 1850 కోట్ల రికార్డుని బ్రేక్ చేయటమే కాదు వరల్డ్ మార్కెట్ లో తెలుగు సినిమా వెలుగులతో మళ్లీ ట్రెండ్ మారుతుందో లేదో 2027 లో తేలబోతోంది.