6000 కోట్ల మెగా రిస్క్… కలిసొస్తే 12000 కోట్ల సునామీ

ఇండియన్ సినిమాకే 2000 కోట్లు హయ్యెస్ట్ వసూళ్ల రికార్డు.. అది హిందీ మూవీ దంగల్ కే దక్కింది. తర్వాత బాహుబలి 2, పుష్ప2 మూవీలు 1850 కోట్లు వసూళ్లని రీచ్ అయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2025 | 07:51 PMLast Updated on: Apr 10, 2025 | 7:51 PM

Prabhas Target To 12k Crores Remunaration

ఇండియన్ సినిమాకే 2000 కోట్లు హయ్యెస్ట్ వసూళ్ల రికార్డు.. అది హిందీ మూవీ దంగల్ కే దక్కింది. తర్వాత బాహుబలి 2, పుష్ప2 మూవీలు 1850 కోట్లు వసూళ్లని రీచ్ అయ్యాయి. కట్చేస్తే ఆతర్వాత రికార్డంటే త్రిబుల్ ఆర్ దే… ఎలాచూసినా ఇండియా టాప్ 5 మూవీస్ కూడా ఇంతవరకు 2 వేల కోట్ల రికార్డుని దాటలేదు. కాని అదే ఇప్పుడు జరిగేలా ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ రిలీజ్ కి ముందే 5 వేల కోట్ల లెక్కల్ని కన్ఫామ్ చేస్తోంది. కాని అది రావటానికి ఇంకా రెండేళ్లు టైంపడుతుంది. కానీ ఈలోపు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ కో 12000 కోట్ల సునామీకి సిద్దమయ్యారు. ఒకటి కాదు రెండు కాదు, అరడజన్ షాకులకు సిద్దమయ్యారు. ఆల్రెడీ బడ్జెట్ పరంగా చూస్తేనే 5000 కోట్ల లెక్కలు తేలుతున్నాయి. అవి వర్కవుట్ అయితే 12000 కోట్లు రావటం అనేది మినిమమ్ గ్యారెంటీ.. అదే అన్నీ బ్లాక్ బస్టర్లే అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ చూడని నెంబర్స్ చూస్తామా..?

రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ది రాజా సాబ్ తో ఆగస్ట్ కొస్తాడో, సమ్మర్ కొస్తాడో కాని, రావటం మాత్రం పక్క.. కాని ఇప్పుడు హాట్ టాపిక్ ఇది కాదు.. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఫౌజీ, స్పిరిట్ మూవీలు… ఇవే ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాల లిస్ట్ లో చేరాయి. ప్రీరిలీజ్ బిజినెస్, బడ్జెట్, అలానే హిట్ అయితే వచ్చే వసూళ్ల అంచనా పరంగా ఇదే కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్, దేవర 2 కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాయి

ఫౌజీ మూవీ 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రీరిలీజ్ బిజినెస్ 900 కోట్ల వరకు డీల్ సెట్ అయినట్టు తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే, ఈజీగా 1500 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ఉంది.

ఇక మరో మూవీ స్పిరిట్… అసలే సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ లాంటి కటౌట్ సినిమా తీస్తే బాక్సాఫీస్ లో పూనకాలు రావాల్సిందే… ఈజీగా ఈ కాంబినేషన్ 2 వేల కోట్ల క్లబ్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అలా చూస్తే, ఫౌజీ , స్పిరిట్ రెండీంటి బడ్జెట్ లు వెయ్యికోట్లను రీచ్ అవుతుంటే, ప్రీరిలీజ్ బిజినెస్ లు 2500 కోట్లు రీచ్ అయ్యేలా ఉంది. ఏమాత్రం ఈరెండు వర్కవుట్ అయినా కనీసం 4000 కోట్ల వసూల్ల వరద కన్ఫామ్

ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా వచ్చే ఏడాది మీద రెండు సినిమాలతో దాడి చేయబోతున్నాడు. ఈ ఏడాది వార్ 2 తో ఈజీగా 2 వేల కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేలా ఉన్న తను, వచ్చే ఏడాది డ్రాగన్, దేవర 2 ని ప్లాన్ చేసుకుంటున్నాడు. డ్రాగన్ బడ్జెట్ 600 కోట్లు. ప్రీరిలీజ్ బిజినెస్ 1200 కోట్లు.. సాలిడ్ గా టాక్ వస్తే ఈజీగా 2వేల కోట్ల వసూల్లకి ఛాన్స్ ఉంది

ఇక హిట్ మూవీకి సీక్వెల్స్ ఏవి వచ్చినా 2 వేల కోట్ల దరిదాపుల్లో వసూళ్లుంటాయని పుష్ప2, బాహుబలి 2, కేజీయఫ్ 2 ప్రూవ్ చేశాయి. అలా చూస్తే దేవర 2 కూడా 2 వేలకోట్ల క్లబ్ లో చేరే సినిమానే.

2026 ఏప్రిల్ 14న డ్రాగన్ వచ్చే ఛాన్స్ ఉంటే, 2026 దసరాకు దేవర 2 ని ప్లాన్ చేస్తున్నారట. ఇది కాకుండా రామ్ చరణ్ పెద్ది మూవీ 1000 కోట్ల అంచనాతో వస్తోంది. నాని పారడైజ్ ఏమాత్రం బాగున్న 400 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. ఇక మెగా స్టార్ చిరంజీవి తో అనిల్ రావిపుడి తీసే సినిమా పాన్ ఇండియా రేంజ్ కాకున్నా, ఈజీగా 400 కోట్లు రాబట్టే ఆస్కారముంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆట్లీ తీయబోతున్న మూవీ కూడా పుష్ప2 రేంజ్ లో ఆడితే 2 వేల కోట్లు పెద్ద విషయం కాదు.. అలాచూస్తే ఎన్టీఆర్ 2 సినిమాలు, ప్రభాస్ 2 మూవీలు, ఇక చరణ్, బన్నీ, చిరు, నాని మూవీలన్నీంటి వసూళ్ల అంచనాలు 12000 కోట్లు దాటేలా ఉన్నాయి. ఇదే జరిగితే, బాలీవుడ్ షాక్ కి గురవ్వాల్సిందే.. ఎందుకంటే అక్కడ ఒకే ఏడాది రెండు మూడు సినిమాలు 1000 కోట్లు దాటడమే జరగలేదు. అలాంటిది కనీసం 6 తెలుగు సినిమాలు 2 వేల కోట్ల చొప్పున 12000 కోట్లు రాబడితే, హిస్టరీ క్రియేట్ అవుతుంది. కేవలం అంచనాలే కాదు, రియాలిటీ కూడా అంచనాలకు దగ్గరగా ఉండటంతో, వచ్చే ఏడాది కాస్ట్ లీ ఇయర్ గా మారేలా ఉంది.