Prabhas: సినిమాలకు ప్రభాస్ గుడ్ బై.. కల్కినే ప్రభాస్ చివరి సినిమానా..
ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. దీంతో కంటిన్యూ షూటింగ్స్ కారణాంగా ప్రభాస్ మోకాలు నొప్పి బారిన పడ్డాడట. కొంతకాలం నుంచి తీవ్రమైన మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న ప్రభాస్.. డాక్టర్ల సలహా మేరకు అమెరికా వెళ్లి న్యూయార్క్‌లో ఒక పెద్ద హాస్పిటల్లో మోకాలికి సర్జరీ చేయించుకోబోతున్నాడట.
Prabhas: బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఆకాశాన్నంటింది. ఒక్క సినిమాతోనే ప్రభాస్‌కు వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి ప్రభాస్ తీసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. దీంతో కంటిన్యూ షూటింగ్స్ కారణాంగా ప్రభాస్ మోకాలు నొప్పి బారిన పడ్డాడట. కొంతకాలం నుంచి తీవ్రమైన మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న ప్రభాస్.. డాక్టర్ల సలహా మేరకు అమెరికా వెళ్లి న్యూయార్క్‌లో ఒక పెద్ద హాస్పిటల్లో మోకాలికి సర్జరీ చేయించుకోబోతున్నాడట.
దీనికి అనుగుణంగా డిసెంబర్ వరకు ‘కల్కి 2898‘ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని నిశ్చయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సర్జరీ తర్వాత కనీసం ఏడాదిన్నర పాటు ప్రభాస్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందట. దీంతో ఈ ఏడాదిన్నర పాటు ప్రభాస్ సినిమాలకి గుడ్‌బై చెప్పబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కల్కి 2898 మూవీతోపాటు ప్రభాస్ మరో మూడు సినిమాలను ఒప్పుకున్నాడు. మారుతి డైరెక్షన్‌లో హారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. ఆ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ వంగాతో స్పిరిట్, అలానే బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా లెవెల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభాస్ అనారోగ్యం రీత్యా ఈ మూడు సినిమాల షూటింగ్ ఏడాదిన్నర ఆలస్యం అవనుంది.
బహుబలి సినిమా టైంలోనే ప్రభాస్ మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఆ నొప్పితోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఆదిపురుష్, సలార్ సినిమా షూటింగ్ టైంలో నొప్పి తిరగబడటంతో చాలా ఇబ్బందిపడ్డారు. ఈ విషయం ఆదిపురుష్ ఈవెంట్ టైంలో క్లియర్‌గా తెలుస్తోంది. దీంతో నొప్పి భరించడం ఇబ్బందిగా మారడంతో మోకాలి సర్జరీకి అమెరికా వెళ్లనున్నారట. గాయం నుంచి పూర్తిగా కొలుకున్నాకే తిరిగి కొత్త సినిమాలు ఒప్పుకొనున్నారట. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నప్పటికి, డార్లింగ్ ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటున్నారు. ప్రభాస్ పూర్తిగా కోలుకుని, మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.