Prabhas : ఎవరికి దొరక్కుండా వెళ్లిపోయిన ప్రభాస్!

ప్రభాస్ (Prabhas) గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా(Social Media)లో ఓ న్యూస్ వైరల్ (Newsa Viral) అవుతోంది. ఓ నెల రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడనే మాట వినిపిస్తోంది. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి కల్కి రాబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 2, 2024 | 03:32 PMLast Updated on: Feb 02, 2024 | 3:32 PM

Prabhas Who Left Without Finding Anyone

 

ప్రభాస్ (Prabhas) గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా(Social Media)లో ఓ న్యూస్ వైరల్ (Newsa Viral) అవుతోంది. ఓ నెల రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడనే మాట వినిపిస్తోంది. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి కల్కి రాబోతోంది. మే 9న కల్కి (Kalki) 2898 ఏడి రిలీజ్ కానుంది. ఆ తర్వాత రాజా సాబ్ రానుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడు డార్లింగ్. కానీ సడెన్‌గా బ్రేక్ ఇచ్చి యూరప్ ట్రిప్ ప్లాన్ చేశాడని అంటున్నారు. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి.

గత కొన్నాళ్లుగా షూటింగ్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్‌.. రిలాక్స్ అవడానికి నెల రోజుల పాటు గ్యాప్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల రోజుల పాటు ఎవ్వరికీ దొరకుండా ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాడట. అలాగే.. హెల్త్‌ మీద కూడా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. గతంలో అయిన గాయాల నుంచి పూర్తిగా రికవరీ అవడానికే ఈ బ్రేక్ అంటున్నారు. తిరిగి మార్చిలో కల్కి బ్యాలెన్స్ షూటింగ్‌తో పాటు రాజా సాబ్‌ను కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట.

మరోవైపు నాగ్ అశ్విన్ ‘కల్కి’ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే డార్లింగ్ తిరిగొచ్చాక కల్కి ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మార్చిలో కల్కి ప్రమోషన్స్ స్టార్ట్ అయితే.. మే 9న సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రభాస్ ఫ్యాన్స్‌దే హవా ఉండనుంది. యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR) ‘దేవర’ (Devara) సినిమా పోస్ట్ పోన్ అయితే.. సమ్మర్‌లో వస్తున్న ఏకైక పెద్ద సినిమా కల్కినే కాబట్టి.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగే. అయితే ప్రభాస్ రెస్ట్ మోడ్ నుంచి ఎప్పుడు బయటికి వస్తాడో చూడాలి.