Prabhas : ప్రభాస్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్

ఫ్యాన్స్‌కు ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తానని మాటిచ్చిన ప్రభాస్.. ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే.. ఒకేసారి ప్రభాస్ ఇన్ని భారీ సినిమాలు ఎలా చేస్తున్నాడనేది అంతుబట్టని విషయమే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 2, 2024 | 10:30 AMLast Updated on: Jul 02, 2024 | 10:30 AM

Prabhas Who Told His Fans That He Will Release Two Films A Year Is Planning In That Way

ఫ్యాన్స్‌కు ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తానని మాటిచ్చిన ప్రభాస్.. ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే.. ఒకేసారి ప్రభాస్ ఇన్ని భారీ సినిమాలు ఎలా చేస్తున్నాడనేది అంతుబట్టని విషయమే. గతేడాది ఆదిపురుష్, సలార్ సినిమాలను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చిన ప్రభాస్.. ఈ ఏడాదిలో కల్కిగా వచ్చాడు. ఈ ఇయర్ ఎండింగ్‌లో రాజాసాబ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే.. ప్రభాస్ లైనప్ తీసుకుంటే.. సలార్ 2, రాజాసాబ్, స్పిరిట్‌తో పాటు కల్కి 2 కూడా ఉంది. ఇప్పటికే రాజాసాబ్ సెట్స్ పై ఉండగా.. త్వరలోనే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాత స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది. కానీ అప్పుడే మరో కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే హ‌ను రాఘ‌వ‌పూడి ప్రాజెక్ట్‌ని ప్రభాస్ ఓకె చెప్పినట్టుగా టాక్ ఉంది.అయితే.. ఈ సినిమాను అక్టోబ‌ర్‌లో మొద‌లు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారనేది లేటెస్ట్ అప్డేట్. వార్‌ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ లవ్‌స్టోరీకి ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ చివరి దశకు చేరుకున్నాయట. దీంతో ఈ ఏడాది అక్టోబరులో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అప్పటి వరకు రాజాసాబ్‌తో పాటు సలార్ 2 షూట్ కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట ప్రభాస్.

అయితే.. ఈ ఏడాది చివర్లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుందని.. ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి వంగ. కానీ ఇప్పుడు అక్టోబర్‌లో హను రాఘవపూడి సినిమా అంటున్నారు. అయితే.. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమా స్టార్ట్ చేస్తుంటాడు ప్రభాస్. కాబట్టి.. హను రాఘవపూడి సినిమా లేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడుంటుందో చూడాలి.