PRABHAS: సలార్ కోసం నీల్ నయా స్కెచ్.. వరల్డ్ కప్ మ్యాచ్‌లో ప్రభాస్ సందడి..

వన్డే వరల్డ్ కప్​-2023లో భాగంగా గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్​లో నెదర్లాండ్స్ టీమ్​తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్​కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రానున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తన కొత్త మూవీ ‘సలార్’ ప్రమోషన్స్​ను ఇక్కడి నుంచే డార్లింగ్ మొదలుపెట్టనున్నారని టాక్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2023 | 02:03 PMLast Updated on: Nov 04, 2023 | 2:03 PM

Prabhas Will Attend Indias World Cup Match For Salaar Promotions

PRABHAS: ప్రజలకు ఎంటర్​టైన్​మెంట్ అంటే వెంటనే సినిమా, క్రికెట్టే గుర్తుకొస్తాయి. మూవీస్​ అంటే పడిచచ్చే వాళ్లు ఇక్కడ కోట్లలో ఉన్నారు. క్రికెట్​ అంటే ఇష్టపడేవాళ్లు, క్రికెటర్లను ఫాలో అయ్యేవాళ్లూ అంతే సంఖ్యలో ఉన్నారు. కాస్త గ్యాప్ దొరికినా సినిమాకు వెళ్తూ.. వీకెండ్స్​లో ఫ్యామిలీతో కలసి మూవీస్​ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక వరల్డ్ కప్ మొదలవ్వడంతో కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కపోతారు. మ్యాచ్ అయ్యే వరకు ఎన్ని పనులున్నా పోస్ట్​పోన్ చేసుకుంటారు.

ఇక టీమిండియా ఆడే మ్యాచులకు సినీ తారలు అటెండ్ అవుతూ సందడి చేస్తుంటారు. రజినీకాంత్, ఆమిర్ ఖాన్, విక్టరీ వెంకటేష్ ఇప్పటికే అంటెడ్ కాగా.. ఇప్పుడు మరో క్రేజీ హీరో రానున్నట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్​-2023లో భాగంగా గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్​లో నెదర్లాండ్స్ టీమ్​తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్​కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రానున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తన కొత్త మూవీ ‘సలార్’ ప్రమోషన్స్​ను ఇక్కడి నుంచే డార్లింగ్ మొదలుపెట్టనున్నారని టాక్. ఈ న్యూస్ విన్న ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ప్రభాస్​ను గ్రౌండ్​లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘సలార్’ ప్రమోషన్స్​ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గట్టిగానే ప్లాన్ చేశాడుగా అని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఐడియా సూపర్ అని.. ప్రభాస్ మ్యాచ్​కు వస్తే ‘సలార్’పై హైప్ ఇంకా పెరుగుతుందని నెటిజన్స్ అంటున్నారు.

ప్రమోషన్లలో మరింత స్పీడ్ పెంచాలని.. అప్పుడే ఎక్స్​పెక్టేషన్స్ ఇంకా ఎక్కువవుతాయని సూచిస్తున్నారు. అయితే భారత మ్యాచ్​కు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తాడనే దానిపై ఇంకా అఫీషియల్​గా కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఒకవేళ ఆయన మ్యాచ్​కు వస్తే మాత్రం మామూలుగా ఉండదు. స్టేడియంలోని కెమెరాలన్నీ ప్రభాస్ మీదే ఉంటాయని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. భారత్​ మ్యాచ్​కు ప్రభాస్ వస్తే ఎలా ఉంటుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.