PRABHAS: సలార్ 2 కోసం ఏకంగా 18 లుక్స్ రెడీ అయ్యాయా..?

బేసిగ్గా సినిమా తీసే ముందు హీరో, హీరోయిన్ల లుక్ టెస్ట్ చేయటం, ఆ ఫోటోలను, ఫోటో షాప్ లేదా ఆఫ్టర్ ఎఫెక్ట్స్.. ఇలా గ్రాఫిక్స్ డిజైనర్‌తో కొన్ని కొత్త లుక్స్‌ని డిజైన్ చేసి సెట్ అవుతాయా లేదా అని చూడం కామన్. అలా సలార్ 2 లో ప్రభాస్ కొత్త లుక్ కోసం ప్రశాంత్ నీల్ 18 లుక్స్ రెడీ చేశాడని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2024 | 06:49 PMLast Updated on: Mar 19, 2024 | 7:07 PM

Prabhas Will Be Seen In New Look In Salaar 2 By Prasanth Neel

PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఒక వైపు కల్కి పెండింగ్ ప్యాచ్ వర్క్ నడుస్తోంది. మరో వైపు ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్లాన్ జరుగుతోంది. ఇలాంటి టైంలో సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫోటో షాప్ వర్క్ షురూ చేశాడు. అది కూడా ప్రభాస్ కొత్త లుక్ కోసం చేసిన ఫోటో షూట్‌లో ప్రభాస్ లుక్‌కి ఫోటో షాప్‌లో మెరుగులు దిద్దుతున్నాడు. బేసిగ్గా సినిమా తీసే ముందు హీరో, హీరోయిన్ల లుక్ టెస్ట్ చేయటం, ఆ ఫోటోలను, ఫోటో షాప్ లేదా ఆఫ్టర్ ఎఫెక్ట్స్.. ఇలా గ్రాఫిక్స్ డిజైనర్‌తో కొన్ని కొత్త లుక్స్‌ని డిజైన్ చేసి సెట్ అవుతాయా లేదా అని చూడం కామన్.

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ సార‌థ్యంలో సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివ‌ల్.. పండ‌గే..పండ‌గ‌..

అలా సలార్ 2 లో ప్రభాస్ కొత్త లుక్ కోసం ప్రశాంత్ నీల్ 18 లుక్స్ రెడీ చేశాడని తెలుస్తోంది. రాజమౌళి మూవీ కోసం మహేశ్‌ని 8 రకాల లుక్స్‌లో గ్రాఫిక్స్‌లో సెట్ చేసి, ఫైనల్‌గా ఒక లుక్ ఓకే చేశారు. ఆ లుక్ వచ్చేలా మహేశ్ బాబుని రెడీ అవ్వమన్నారు. అచ్చంగా అలానే సలార్ 2 లో ప్రభాస్ లుక్ కోసం పనులు జరిగాయి. సలార్ 1లో కనిపించినట్టు ప్రభాస్ సలార్ 2లో కనిపించడట. ఈ సారి మరింత రఫ్‌గా ఉండేలా శౌర్యాంగ పర్వం ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. దానికి కారణం సలార్ 1లో ప్రభాస్ పాత్ర కేవలం ఓ డాన్్కి ఫ్రెండ్.

కాని ప్రభాసే శౌర్యాంగ గ్రూప్ లీడర్ అని తేలటం, ఆ కోణంలో స్నేహితుడితోనే యుద్దానికి దిగాల్సి రావటంతో, తన లుక్ మారక తప్పదు. ఆలుక్‌నే గ్రాఫిక్స్‌లో 18 రకాలు రెడీ చేశారు. అందులో ఏదో ఒకటి ఫిక్స్ అయితే, అందుకు తగ్గ మేకోవర్, కాస్ట్యూమ్స్, మజిల్స్ ఇలా అన్ని మార్పులు జరగాల్సి ఉంటుంది.