PRABHAS: ఒకేసారి ఇన్ని సినిమాలా.. ప్రభాస్‌కు ఎలా సాధ్యం..?

ఒకవేళ లక్కీగా మే 9కి కల్కి మూవీ వచ్చినా, సలార్ 2 షూటింగ్‌కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే, మే 9న సలార్ 2 షూటింగ్ మొదలైనా, సెట్లో మాత్రం ప్రభాస్ ఉండడు. తను లేని సీన్లే ముందుగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2024 | 06:51 PMLast Updated on: Mar 12, 2024 | 6:51 PM

Prabhas Will Do Three Movies Simulataniously From June

PRABHAS: సలార్ సినిమాకు సీక్వెల్ షురూ కాబోతోందని రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. అదే ఇప్పుడు నిజమౌతోంది. మే 9 నుంచే సలార్ 2 షూటింగ్ అని సమాచారం అందుతోంది. నిజానికి ఆరోజు కల్కి మూవీ రిలీజ్ అనుకున్నప్పుడు ప్రభాస్ ఎలా మే 9 షూటింగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే డౌట్ రావొచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. కల్కి మూవీ మే 9న రాకపోవటానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. గ్రాఫిక్స్ పనుల క్వాలిటీ నచ్చకున్నా, పూర్తికాకున్నా కల్కి మూవీ వాయిదా పడటం ఖాయం.

ANANYA NAGALLA: వేణుస్వామిని కలిసిన అనన్య.. తంత్ర కోసం ప్రత్యేక పూజలా..?

ఒకవేళ లక్కీగా మే 9కి కల్కి మూవీ వచ్చినా, సలార్ 2 షూటింగ్‌కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే, మే 9న సలార్ 2 షూటింగ్ మొదలైనా, సెట్లో మాత్రం ప్రభాస్ ఉండడు. తను లేని సీన్లే ముందుగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నాడు. జూన్ నుంచే సలార్ సీక్వెల్ షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ అవుతాడట. వింటానికి ఇది బానే ఉన్నా, ఒకే జూన్‌లో ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తాడనే ప్రశ్నే తలెత్తులోంది. ఎందుకంటే జూన్ నుంచే హనురాఘవపూడి మేకింగ్‌లో మృణాల్‌తో ప్రభాస్ చేసే సినిమా మొదలు కాబోతోంది. ఆల్రెడీ ది రాజా సాబ్ అంటూ మారుతి మేకింగ్‌లో ప్రభాస్ సినిమా ఇంకా పూర్తికావాల్సి ఉంది. ఇన్ని సినిమాలు ఒకే సారి ఎలా సాధ్యం అన్నడౌట్లే పెరిగాయి. అయితే కల్కి పాట తాలూకు ఇటలీ షూట్ పూర్తి కాగానే, ఇండియాలో మిగతా ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్‌తో ప్రభాస్ బిజీ అవుతాడట.

తర్వాత కల్కి ప్రమోషన్ షురూ చేసి జూన్‌లో ది రాజా సాబ్ మూవీతోపాటు సలార్ 2 ని సమాంతరంగా చేసేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు. ఇక జూన్‌లోనే స్పిరిట్ లాంచ్ అయినా అక్టోబర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ కాబట్టి ప్రభాస్‌కి ఇబ్బంది లేదు. కాని సీతారామం ఫేం హనురాఘవపూడితో ప్రభాస్ అనుకున్న మూవీ షూటింగ్ జూన్‌లో అనుకున్నా, అప్పుడే షూటింగ్ అయ్యే పనిలా కనిపించట్లేదు. 180 రోజుల కాల్‌షీట్లు ఇచ్చిన ప్రభాస్ మరి ఏ డేట్లు ఇచ్చాడో ఎలా ఇన్ని సినిమాలు ఒకేసారి చేస్తాడో మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగిలి పోతోంది.