box office dinosaur : ప్రభాస్ నువ్వు బాక్సాఫీస్ డైనోసార్ 

తాజాగా విడుదలైన ‘సలార్‌’ భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రశంసలు పొందుతోంది. ఇప్పటికే దీనిపై పలువురు సినీ ప్రముఖులు రివ్యూ ఇవ్వగా.. తాజాగా చిరంజీవి ‘సలార్‌’పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. నటీనటులతో పాటు చిత్రబృందాన్ని అభినందించారు. ‘‘దేవా పాత్రతో ఆకట్టుకున్న ప్రభాస్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘సలార్‌ సీజ్ ఫైర్‌’ బాక్సాఫీస్‌ వద్ద అదరగొడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2023 | 05:10 PMLast Updated on: Dec 23, 2023 | 5:11 PM

Prabhas You Are A Box Office Dinosaur

 

తాజాగా విడుదలైన ‘సలార్‌’ భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రశంసలు పొందుతోంది. ఇప్పటికే దీనిపై పలువురు సినీ ప్రముఖులు రివ్యూ ఇవ్వగా.. తాజాగా చిరంజీవి ‘సలార్‌’పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. నటీనటులతో పాటు చిత్రబృందాన్ని అభినందించారు. ‘‘దేవా పాత్రతో ఆకట్టుకున్న ప్రభాస్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘సలార్‌ సీజ్ ఫైర్‌’ బాక్సాఫీస్‌ వద్ద అదరగొడుతోంది.

ఇంత గొప్ప సినిమాను అందించిన ప్రశాంత్‌ నీల్‌కు అభినందనలు. ఆయన సినీరంగంలో మరింత రాణిస్తారు. ఇక ఇందులో వ‌ర‌ద రాజమ‌న్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, ఆద్యగా శ్రుతిహాస‌న్, అలాగే క‌ర్త రాజ మ‌న్నార్ పాత్రలో జ‌గ‌ప‌తిబాబు అద్భుతంగా నటించారు. టెక్నికల్‌ టీమ్‌ పనితీరు కూడా ప్రశంసనీయంగా ఉంది. ఇంత పెద్ద విజయం సాధించినందుకు అందరికీ అభినందనలు’’ అని చిరంజీవి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ను ప్రభాస్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. తొలిరోజు ఏకంగా రూ.170 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సలార్, బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ని మించిన డైనోసార్ మరోటి లేదు అని నిరూపించింది అంటూ, మెగా స్టార్ ఆత్మీయంగా మెచ్చుకున్నాడు.