PAWAN KALYAN: పవన్, బన్నీ రూట్లో విజయ్ దేవరకొండ, ప్రభాస్
త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్‌లో తను కమిటైన మూవీలో ఐపీఎస్ రోల్ వేయబోతున్నాడట బన్నీ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఫస్ట్ టైం పోలీస్ యూనిఫాం వేసుకోబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో తను చేయబోయే సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతోంది.

PAWAN KALYAN: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్‌గా వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్‌గా కూడా అదే లాఠీతో బాక్సాఫీస్‌ని లూఠీ చేయబోతున్నాడు. రెండూ కూడా రీమేకులే. అది హిందీ మూవీ దబాంగ్ రీమేక్ అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ తేరీ తెలుగు రీమేక్. ఏపి ఎలక్షన్స్ తర్వాత ఓజీ, ఆ వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతుంది.
RAM CHARAN: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అడ్డు పడుతున్న శంకర్
అలా పవన్ లాఠీ చార్జ్‌కి రెడీ అవుతుంటే స్పిరిట్‌తో అక్టోబర్‌లో దండెత్తేందుకు సిద్దమయ్యాడు ప్రభాస్. తన కెరీర్‌లో ఏక్ నిరంజన్‌లో బౌంటీ హంటర్‌గా తను కనిపించాడు ప్రభాస్. కాని, ఎన్నడూ పూర్తి స్థాయిలో పోలీస్ ఆఫీసర్ రోల్ వేయలేదు. అది సందీప్ రెడ్డి వంగ మేకింగ్‌లో నిజం కానుంది. స్పిరిట్ అక్టోబర్ నుంచి పట్టలెక్కనుంది. ఇక ఇలానే లాఠీ పట్టుకునేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రెడీ అయ్యాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్‌లో తను కమిటైన మూవీలో ఐపీఎస్ రోల్ వేయబోతున్నాడట బన్నీ.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఫస్ట్ టైం పోలీస్ యూనిఫాం వేసుకోబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో తను చేయబోయే సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతోంది. మొత్తంగా నలుగురు టాప్ స్టార్లు పోలీస్ పాత్రల్లో లాఠీ ఛార్జ్‌కి రెడీ అయ్యారు. బాక్సాఫీసుపై దూసుకెళ్లేందుకు రెడీ అయ్యారు.