PRABHAS VS JR NTR: దేవర మూవీ కొంపముంచేస్తున్న కల్కి 2898 AD టీం
ప్రభాస్ నిర్ణయం వల్ల దేవరకి పోటీగా కల్కి 2898 ఏడీని బరిలోకి దింపాల్సి వస్తోందట. నిజానికి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ గతంలో మహానటిని మే 9న రిలీజ్ చేశాడు. కాబట్టి కల్కిని కూడా మే 9కే విడుదల చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది.
PRABHAS VS JR NTR: యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారాక చేస్తున్న మూవీ దేవర. ఈ సినిమాతోనే తన బిరుదు మారింది. ఏప్రిల్ 5నే కొరటాల శివ చేసిన ప్రయోగం దేవరగా రిలీజ్ కాబోతోంది. ఇది ఎప్పుడో ఫిక్స్ చేశారు. అలాంటి ఈ సినిమాకు పోటీగా మరో మూవీ వస్తుందనే ఆలోచనే ఇంతవరకు క్రియేట్ కాలేదు. కాని ప్రభాస్ నిర్ణయం వల్ల దేవరకి పోటీగా కల్కి 2898 ఏడీని బరిలోకి దింపాల్సి వస్తోందట. నిజానికి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ గతంలో మహానటిని మే 9న రిలీజ్ చేశాడు.
GUNTUR KAARAM REVIEW: ‘గుంటూరు కారం’ ఎలా ఉంది..? ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
కాబట్టి కల్కిని కూడా మే 9కే విడుదల చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. సంక్రాంతికి రావాల్సిన కల్కి మే నెలకి వాయిదా పడటానికి సలార్‌తో పోటీ ఉండకూడదనే నిర్ణయమే. అయితే, మే 9కి అనుకున్న కల్కి 2898 ఏడీని ఉన్నట్టుండి ఏప్రిల్‌కి ప్రి పోన్ చేశారట. రెబల్ స్టార్ నిర్ణయం వల్లే ఇది జరిగేలా ఉందట. ప్రభాస్ నిర్ణయించిన తేదీ ప్రకారం చూస్తే కల్కి 2898 మూవీ ఏప్రిల్ 12కి వచ్చేలా ఉంది. అంటే ఏప్రిల్ 5న మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ మూవీ వస్తే, వారం గ్యాప్ తర్వాత కల్కి 2898 ఏడీ వస్తుంది. ఇది ఖచ్చితంగా దేవర వసూళ్లని ప్రభావితం చేసే నిర్ణయమే.
కనీసం నెల గ్యాప్ ఉండే తప్ప రూ.350 కోట్ల దేవర కనీసం రూ.500 కోట్లు రాబట్టాలంటే పోటీగా మరో మూవీ ఉండకూడదు. కనీసం 15 నుంచి 20 రోజుల టైం గ్యాపైనా ఉండాలి. కాని ప్రభాస్ నిర్ణయం వల్ల దేవర విడుదలైన వారానికే కల్కి 2898 ఏడీ రిలీజ్ అయ్యేలా ఉంది. అలా అయితే ఇద్దరు స్నేహితుల మధ్య వార్ తప్పేలా లేదు.