Prabhas: కల్కి.. ప్రభాస్ కాదా? ఇది సంక్రాంతికి రావట్లేదా..?
ఈ మూవీ రిలీజ్ ఇయర్ 2024 అని ఇచ్చారు. కానీ, రిలీజ్ డేట్ జనవరి 12 అని మాత్రం తేల్చలేదు. అంటే ఇది సంక్రాంతికి రిలీజ్ కాదా..? పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేటవ్వొచ్చనే ఉద్దేశ్యంతోనే రిలీజ్ డేట్‌ని తేల్చలేదా?
Prabhas: ప్రాజెక్ట్ కే గ్లింప్స్ బాగున్నా, ఫ్యాన్స్ ఫిదా అయినా.. డౌట్లు రావటం మాత్రం ఆగట్లేదు. ప్రభాస్ లుక్ చూస్తుంటే తనే కల్కి అనుకోవాల్సి వస్తుంది. కాని వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే అని ఫారెనర్ అడగటం, గ్లింప్స్‌లో విజువల్స్ బట్టి చూస్తే ప్రభాస్ సూపర్ హీరో పాత్ర వేసినా, కల్కి మాత్రం తను కాదా అన్న డౌట్లు పెరిగాయి. ఇక ఈ మూవీ రిలీజ్ ఇయర్ 2024 అని ఇచ్చారు. కానీ, రిలీజ్ డేట్ జనవరి 12 అని మాత్రం తేల్చలేదు. అంటే ఇది సంక్రాంతికి రిలీజ్ కాదా..?
పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేటవ్వొచ్చనే ఉద్దేశ్యంతోనే రిలీజ్ డేట్‌ని తేల్చలేదా? ఈ లెక్కన ప్రాజెక్ట్ కే వాయిదా పడనుందనే ప్రచారం నిజమని గ్లింప్స్‌తో ఫిల్మ్ టీం తేల్చేసిందా..? ఈ డౌట్లన్నీ రావటానికి టీజర్ చివారఖర్లో రిలీజ్ ఇయర్ మాత్రమే ఇవ్వటం కారణం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న లీకుల ప్రకారం ప్రాజెక్ట్ కే కాన్సెప్ట్ మీద రకరకాల గుసగుసలు పెరిగాయి. అలా చూస్తే 3000 ఏళ్ల తర్వాత ఘోరమైన వినాశనం చూసిన భూమిని, కాపాడేందుకు కాలంలో వెనక్కి.. అంటే సరిగ్గా 2898 సంవత్సరానికి వెళతాడు హీరో. అలా ఆ కాలంలోకి వెళ్లాక తన లాంటి ఆకారంతో ఓ పెద్ద విగ్రహం ఉండటం, తనకి ఆ కాలానికి సంబంంధం ఏంటో తెలుసుకునే ప్రాసెస్‌లో తను కూడా ప్రాజెక్ట్ కేలో భాగం అతని తెలుస్తుందట.
గ్లింప్స్‌లో విగ్రహం చేయి విరిగి కిందపడితే, ఆ విగ్రహం కాల్లు, బూట్ల ఆకారం చూస్తే, అది హీరో విగ్రహమే అని తెలుస్తోంది. సో హీరో.. తనే మరోసారి తన గతంలోకి తనకే తెలియకుండానే వెళ్లి భూమిని కాపాడే మిషనే ప్రాజెక్ట్ కే అంటూ ఓ కాన్సెప్ట్ లీకుల రూపంలో వినిపిస్తోంది.