RAJA SAAB: రాధేశ్యామ్‌తో.. రాజా సాబ్‌కు పోలిక‌.. ఇదేం లెక్క రాజాసాబ్..!

టీ షర్ట్, పూల లుంగీతో ప్రభాస్ చాలా మాసివ్‌గా, స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు. ప్రభాస్ హెయిర్‌స్టైల్ కూడా గత చిత్రాలతో పోలిస్తే చాలా కొత్తగా ఉంది. కాస్త లాంగ్ హెయిర్‌తో చాలా అట్రాక్ట్ చేస్తున్నాడు. దీంతో.. మారుతి నిజంగానే వింటేజ్ ప్రభాస్‌ను చూపిస్తున్నాడని ఫ్యాన్స్ ఫిక్స‌యిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 16, 2024 | 12:49 PMLast Updated on: Jan 16, 2024 | 12:49 PM

Prabhass Raja Saab Moivie Title Facing Criticism From Fans

RAJA SAAB: సలార్‌తో సూపర్ హిట్ అందుకుని.. వ‌రుస భారీ ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. వ‌రుస యాక్ష‌న్ మూవీస్‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌.. చాలా రోజుల త‌ర్వాత మారుతి డైర‌క్ష‌న్‌లో వ‌స్తున్న రాజాసాబ్ మూవీలో ఒకప్పటి డార్లింగ్ లుక్స్‌తో అద‌ర‌గొడుతున్నాడు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ మూవీ టైటిల్ ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ రచ్చ చేస్తోంది. రాజా సాబ్‌గా ప్ర‌భాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. టీ షర్ట్, పూల లుంగీతో ప్రభాస్ చాలా మాసివ్‌గా, స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు.

MAHESH BABU: మ‌హేశ్‌బాబుకు మ‌రో కొత్త టెన్ష‌న్‌..

ప్రభాస్ హెయిర్‌స్టైల్ కూడా గత చిత్రాలతో పోలిస్తే చాలా కొత్తగా ఉంది. కాస్త లాంగ్ హెయిర్‌తో చాలా అట్రాక్ట్ చేస్తున్నాడు. దీంతో.. మారుతి నిజంగానే వింటేజ్ ప్రభాస్‌ను చూపిస్తున్నాడని ఫ్యాన్స్ ఫిక్స‌యిపోయారు. అయితే.. రాజా సాబ్ టైటిల్‌తో.. ప్ర‌భాస్ రాధేశ్యామ్ టైటిల్‌ను పోలుస్తూ కొంద‌రు నెట్టింట్లో ర‌చ్చ చేస్తున్నారు. రెండు టైటిళ్ల మ‌ధ్య పోలిక‌లు పెడుతూ రాజా సాబ్ మూవీకూడా ఫ‌ట్టేనా అంటూ డౌట్లు క్రియేట్ చేస్తున్నారు. మారుతి- ప్ర‌భాస్ మూవీకి రాజా సాబ్ అంటూ టైటిల్ ఫస్ట్ లుక్ అలా వచ్చిందో లేదో ఇంతలోనే సోషల్ మీడియాలో సరికొత్త అనుమానాలు మొద‌ల‌య్యాయి. రాజాసాబ్ టైటిల్ షార్ట్ ఫామ్ ‘RS’ అని వస్తుంది. అలాగే రాధే శ్యామ్ టైటిల్‌కి షార్ట్ ఫామ్ కూడా ‘RS’ అనే వస్తుంది. రెండు సినిమాల షార్ట్ ఫామ్స్ సేమ్ ఉన్నాయంటే ‘రాధే శ్యామ్’ లాగే ‘రాజా సాబ్’ కూడా ప్రభాస్ కెరియర్‌లో ప్లాప్ మూవీ అవుతుందా..? అంటూ కొంద‌రు డౌట్స్ లేవ‌నెత్తుతున్నారు.

కొంద‌రేమో ఏకంగా ఫన్నీ మీమ్స్ అండ్ వీడియోస్ క్రియేట్ చేసి వైర‌ల్ చేస్తున్నారు. దీంతో.. కావాల‌నే కొంద‌రు ఇలాంటి డౌట్స్ క్రియేట్ చేస్తున్నార‌ని డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవుతుందంటూ మండిప‌డుతున్నారు. మారుతిని ప్రభాస్ నమ్మాడు అంటే తప్పకుండా కాన్సెప్ట్ రొటీన్‌గా ఉండదంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌.. రాజా సాబ్ మూవీ కోసం మారుతి కూడా చాలా కేర్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా డైరెక్టర్ మారుతి తన సినిమాల్లో హీరో లుక్ మీద చాలా కేర్ తీసుకుంటారు. రాజా సాబ్ పోస్టర్‌లో ఈ కేర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక‌.. న్యూమ‌రాల‌జీని విప‌రీతంగా న‌మ్మే మారుతి.. ప్ర‌భాస్ పేరులో కూడా మార్పు చేసిన‌ట్లు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ద్వారా అర్థ‌మ‌వుతోంది. ఇంగ్లిష్‌లో ప్రభాస్ స్పెల్లింగ్ సాధారణంగా ప్ర‌భాస్ అని వస్తుంది. కానీ ఈ పోస్టర్‌లో ఇంగ్లీషులో ఒక ఎస్ అక్షరం ఎక్కువగా యాడ్ చేశారు. దీంతో.. మారుతి సెంటిమెంట్ ఈ మూవీకి ఎంత వ‌ర‌కు ల‌క్‌ను తీసుకొస్తుందో చూడాల‌న్న టాక్ న‌డుస్తోంది. మొత్తానికి ఇలా ఎన్నో ర‌కాల లెక్క‌ల‌తో రాజా సాబ్ మూవీ ఇప్ప‌టి నుంచే సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిందన్న‌మాట‌.