Salaar: సలార్ ర్యాంపేజ్.. ‘శౌర్యంగా పర్వం’.. ఈ సారి ఊచకోతే..!

సలార్ ఇచ్చిన జోష్‌తో ప్రభాస్ మరింత జోరుగా తన లైనప్‌లో ఉన్న సినిమాలు చేస్తున్నాడు. ఇక ప్రభాస్ ఓ వైపు 'కల్కి' వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు మారుతితో 'రాజాసాబ్' అంటూ ఓ మీడియం రేంజ్ సినిమా చేస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2024 | 03:35 PMLast Updated on: Mar 06, 2024 | 3:35 PM

Prabhass Salaar 2 Shooting Will Start From April This Year

Salaar: దాదాపు ఆరేళ్ల నిరీక్షణ తర్వాత ‘సలార్’తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. హిట్టంటే మళ్లీ.. ఆషామాషీ హిట్టు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర రూ.800 కోట్ల రీ సౌండ్ వినిపించింది. రాజమౌళి తర్వాత ప్రభాస్‌లాంటి కటౌట్‌ను ప్రశాంత్ నీల్ పర్‌ఫెక్ట్‌గా వాడుకున్నాడని పొంగిపోయారు. మూడు గంటల సుధీర్ఘ రన్‌టైమ్‌ ఉన్నా.. సినీ లవర్స్ రిపీటెడ్ షోలు వేశారు. కథ పరంగా కొంత కన్ఫ్యూజ్ అనిపించినా.. ప్రభాస్ ఎలివేషన్ల ముందు స్టోరీ కూడా నథింగ్‌లా అనిపించింది. సలార్ ఇచ్చిన జోష్‌తో ప్రభాస్ మరింత జోరుగా తన లైనప్‌లో ఉన్న సినిమాలు చేస్తున్నాడు. ఇక ప్రభాస్ ఓ వైపు ‘కల్కి’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు మారుతితో ‘రాజాసాబ్’ అంటూ ఓ మీడియం రేంజ్ సినిమా చేస్తున్నాడు.

Varalaxmi Sarathkumar: జయమ్మ ట్విస్ట్.. వరలక్ష్మీ శరత్ కుమార్‌‌‌కు కాబోయే భర్తకు ముందే పెళ్లైందా..!

ఇవే కాకుండా ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా కూడా లైనప్ లో ఉంది. ఇవన్నీ పూర్తయ్యాకే సలార్ రెండో భాగం శౌర్యాంగ పర్వం ప్రారంభం కాబోతుందని రిలీజయ్యాక క్లారిటీ ఇచ్చారు. దాంతో ప్రభాస్ ఆడియెన్స్‌తో పాటు.. చాలా మంది సినీ లవర్స్ శౌర్యాంగ పర్వం తొందరగా షూటింగ్ మొదలైతే బావుండు అనుకున్నారు. కాగా తాజాగా ‘సలార్’ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ను బాబీ సింహా చెప్పాడు. సలార్ రెండో భాగం సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో స్టార్ట్ అయ్యే చాన్స్ ఉన్నట్లు చెప్పాడు. బాబీ సింహా.. సలార్‌లో బారా అనే కీలక రోల్ చేశాడు. సెకండ్ పార్ట్‌లో ఆయన రోల్ కూడా క్రూసియల్ గా ఉండబోతుందట. కాబట్టి ఆయన చెప్పిన మాటలను పక్కన పడేయలేం. నెల కాస్త అటు ఇటు అనుకున్నా.. మొత్తానికి సమ్మర్‌లో సెకండ్ పార్ట్ స్టార్టవడం పక్కానే. ఇప్పటికే శౌర్యంగ పర్వం కు సంబంధించిన షూటింగ్ 40 శాతం పూర్తయిపోయిందట. మరో 60 శాతం ఈ ఏడాదిలోపు పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక నవంబర్ నెలలో స్పిరిట్ షూటింగ్ మొదలు కాబోతుందని సందీప్ రెడ్డి వంగా ఆల్రెడీ చెప్పేశాడు.

కాబట్టి స్పిరిట్ గురించి ఇప్పుడే గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇక మే 9న రిలీజ్ కాబోతున్న కల్కి సైతం ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్లు మాత్రమే పెండింగ్ ఉంది. ప్రభాస్ తన రోల్ కు డబ్బింగ్ చెప్తే ఈ సినిమా పని కూడా పూర్తయినట్లే. ఇక మారుతీతో సినిమాను జాలీగా చేస్తున్నాడు. ఇదెలాగో వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాంతో సలార్ సెకండ్ పార్టును ఐదారు నెలల్లో కంటిన్యూస్‌గా షూట్ చేస్తే పూర్తయిపోతుంది. మరి ఈ కాల్యుక్యులేషన్స్ ఎంత వరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.