PRABHAS: సలార్‌లో గ్రాఫిక్స్ భయపెడుతున్నాయా..?
ఆదిపురుష్ మూవీని ఆరునెలలు వాయిదా వేశారు. తర్వాత ఏమైంది..? కొండంత రాగం తీసి నాసి రకపు విజువల్స్ ఎఫెక్ట్స్‌తో వచ్చింద మూవీ. ఇప్పుడు సలార్ టీం కూడా ఓం రౌత్ చేసిన తప్పే చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అప్పడు హిందీ దర్శకుడు, ఇప్పుడు కన్నడ డైరెక్టర్.
PRABHAS: సలార్ మూవీ ఈ నెల 28న రాదు.. వాయిదా వేస్తున్నాం.. అంది హోంబలే సంస్థ. కేవలం సాలిడ్ క్వాలిటీ కోసమే ఈ ప్రయత్నం అంది. అక్కడే కొత్త డౌట్లు షాక్ ఇస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు గ్రాఫిక్స్ వర్క్‌లో సాలిడ్ క్వాలిటీ ఔట్ పుట్ రాలేదా..? అంటే ఆదిపురుష్ విషయంలో యానిమేషన్లు ఎలా భయపెట్టాయో సలార్ విషయంలో కూడా గ్రాఫిక్స్ అలానే భయపెడుతున్నాయా..?
ఇదంతా జాగ్రత్తలో భాగం అనుకోవాలా..? ఈ లెక్కనే ఆదిపురుష్ మూవీని ఆరునెలలు వాయిదా వేశారు. తర్వాత ఏమైంది..? కొండంత రాగం తీసి నాసి రకపు విజువల్స్ ఎఫెక్ట్స్‌తో వచ్చింద మూవీ. ఇప్పుడు సలార్ టీం కూడా ఓం రౌత్ చేసిన తప్పే చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అప్పడు హిందీ దర్శకుడు, ఇప్పుడు కన్నడ డైరెక్టర్. ఇలాంటి పోలికలు, వాయిదాలతో మెలికలు.. ఇవన్నీ ఫ్యాన్స్‌ని భయపెడుతున్నాయి. ఆ సంగతి అటుంచింతే, సలార్ వాయిదా పడింది కానీ.. తిరిగి నవంబర్‌కి వస్తుందా.. లేదా డిసెంబర్‌లో రానుందా కూడా తేల్చలేదు ఫిల్మ్ టీం.
మళ్లీ మొదటి నుంచి గ్రాఫిక్ వర్క్ అంటే.. ఐదారు నెలలు అటే పోతుంది. సో సంక్రాంతికే సలార్ అనుకోవాలా..? దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వచ్చినా ఎందుకు సలార్ టీంకి ధైర్యం సరిపోవట్లేదనే మాటే వినిపిస్తోంది. ఆ ప్రకారం చూస్తే, కేజీయఫ్ డైరెక్టర్ సలార్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా అన్న కంగారు ఫ్యాన్స్‌లో పెరిగేలా ఉంది.