Salaar: టపాసులు సిద్దం చేసుకోమంటున్న రెబల్ స్టార్ ప్రభాస్..!

ప్రశాంత్ నీల్ నుంచి కూడా ప్రభాస్‌కి క్లారిటీ వచ్చేసిందని తెలుస్తోంది. ఈ దీపావళికే సలార్ మూవీ రాబోతోంది. నవంబర్ 10న సినిమా రిలీజ్ అని తేలింది. ఇక ట్రైలర్ దసరాకు వచ్చే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్‌కి పండగే అని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 8, 2023 | 05:28 PMLast Updated on: Sep 08, 2023 | 5:28 PM

Prabhass Salaar Movie Will Be Released In November For Diwali

Salaar: సలార్ మూవీ ఈనెల 28న రావాలి. కాని వాయిదా పడిందనే వార్త ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరిచింది. అందుకే ప్రభాస్ తన ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడు. సలార్ విడుదల సంక్రాంతికో, సమ్మర్‌కో కాకుండా కాస్త ముందుగానే ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ నుంచి కూడా ప్రభాస్‌కి క్లారిటీ వచ్చేసిందని తెలుస్తోంది. ఈ దీపావళికే సలార్ మూవీ రాబోతోంది.

నవంబర్ 10న సినిమా రిలీజ్ అని తేలింది. ఇక ట్రైలర్ దసరాకు వచ్చే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్‌కి పండగే అని తెలుస్తోంది. గ్రాఫిక్స్ బాగోలేకపోవటంతో మార్పులు సూచించిన ప్రశాంత్ నీల్.. తన లెక్కల ప్రకారం ఫైనల్ కాపీ రావటానికి 40 రోజులు టైం పడుతుందట. సో దసరా తర్వాత ఎప్పుడైనా ఈ మూవీ ఫైనల్ కాపీ రావొచ్చు. కాబట్టే దీపావళికి ముహుర్తం చూసుకుంటే దసరా నుంచి ప్రమోషన్ మొదలు పెట్టొచ్చనేది ఫిల్మ్ టీం ప్లానింగ్.

ఇక నవంబర్ 1న ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారంటేనే దీపావళికి ఈ సినిమా రిలీజ్ కన్ఫామ్ అనుకోవాల్సి వస్తోంది. ఇక పోటీకి సల్మాన్ మూవీ టైగర్ 3 సీన్‌లోఉన్నా సరే ఈ దీపావళికి తెలుగు సినిమా సందడితో బాక్సాఫీస్‌లో టపాసులు పేలటం కన్ఫామ్ అవుతోంది. వన్ లాక్ వాలాలకు ఆర్డర్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ సిద్దమవ్వాల్సి వస్తోంది.