ప్రభాస్ ఆ ఒక్క మాటతో ఫ్యాన్స్ లో పూనకాలు… స్పిరిట్ ఘాటు తగిలినట్టుంది..

రెబల్ స్టార్ ప్రభాస్ సింగిల్ ట్వీట్ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. రెబల్ ఫ్యాన్స్ లో పూనకాలకు కారణమైంది. ఇప్పటి వరకు పుష్ప2 ఇష్యూ వల్ల బన్నీ కేసే హాట్ న్యూస్ గా మారింది. కట్ చేస్తే రెబల్ స్టార్ సింగిల్ ట్వీట్ తో మొత్తం, అందరి ఫోకష్ ఇటు వైపు షిఫ్ట్ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 26, 2024 | 04:02 PMLast Updated on: Dec 26, 2024 | 4:02 PM

Prabhass Single Words Sent Shockwaves Through The Fans It Seems Like The Spirit Has Been Touched

రెబల్ స్టార్ ప్రభాస్ సింగిల్ ట్వీట్ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. రెబల్ ఫ్యాన్స్ లో పూనకాలకు కారణమైంది. ఇప్పటి వరకు పుష్ప2 ఇష్యూ వల్ల బన్నీ కేసే హాట్ న్యూస్ గా మారింది. కట్ చేస్తే రెబల్ స్టార్ సింగిల్ ట్వీట్ తో మొత్తం, అందరి ఫోకష్ ఇటు వైపు షిఫ్ట్ అయ్యింది. అస్సలు ఆగలేకపోతున్నానంటూ రెబల్ స్టార్ అనటం నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని గాల్లోతేలిపోయేలా చేస్తోంది. అంతా సందీప్ రెడ్డి మహిమే… తనవల్లే రెబల్ స్టార్ అలాంటి ట్వీట్ పెట్టాడు.. ఇంతలో సీన్ లోకి ది రాజా సాబ్ హీరోయిన్ వచ్చింది. ప్రభాస్ మూవీ తాలూకు రూమర్లకు చెక్ పెట్టింది. రాజా సాబ్ వాయిదా మీద క్లారిటీ ఇస్తూనే, కన్ ఫ్యూచ్ చేసిందని కొందరు అంటుంటే, తానే కన్ ఫ్లూజై క్లారిటీ ఇచ్చిందని ఇంకొందంటున్నారు… ఇంతకి రెబల్ స్టార్ ట్వీట్ వల్ల పూనకాలొచ్చేలా ఏం జరిగింది? ఏం జరగబోతోంది? హీరోయిన్ అన్న మాటకు అర్ధమేంటి..?

రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకి బర్త్ డే విషెస్ చెబుతూ, స్పిరిట్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలౌతుందా అన్నట్టు తాను వేయిట్ చేస్తున్నట్టు, సింగిల్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అంతే దెబ్బకి సోషల్ మీడియాలో పూనకాలు మొదలయ్యాయి. ఎందుకంటే మొన్నటి వరకు ప్రభాస్ యాంకిల్ చికిత్సలో భాగంగా రెస్ట్ తీసుకుంటున్నాడు, కాబట్టి తన సినిమాల షెడ్యూల్స్ అన్నీ వాయిదా అనుకున్నారు

కాని రెబల్ స్టార్ సింగిల్ స్టేట్ మెంట్ తో, కొత్త మూవీ మీద తనెంత ఈగర్ గా వేయిట్ చేస్తున్నాడో తెలుస్తోంది. ఒకవేళ తనే రిలాక్స్ మోడ్ లోనే ఉండి ఉంటే, సందీప్ రెడ్డికి జస్ట్ విషెస్ చెప్పేవాడు..అలాకాకుండా ఆగలేకపోతున్నా అనటంతో, స్పిరిట్ కంటెంట్ తనకి ఎంతగా నచ్చిందో చెప్పకనే చెప్పాడు.

ఇక ది రాజా సాబ్ రిలీజ్ డేట్ వాయిదా మీద వస్తున్న రూమర్లకు హీరోయిన్ మాళవికా మోహనన్ బ్రేక్ వేసింది. ఏప్రిల్ 10న ఈ మూవీ రిలీజ్ కన్పామ్ అనేసింది. 80పర్సెంట్ పూర్తైన ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ ని సంక్రాంతి తర్వాతే షూట్ చేయబోతున్నారు. అంతవరకు ప్రభాస్ రెస్ట్ మోడ్ లో ఉంటాడన్నారు. ఐతే ఇలా 20 రోజుల షూటింగ్ బ్రేక్ వల్ల ఏప్రిల్ 10కి ది రాజా సాబ్ రిలీజ్ కాకపోవచ్చనుకున్నారు. కాని ఫిబ్రవరి ఎండ్ కల్లా టోటల్ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే మాళవికా అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చిందంటున్నారు

అలా ఈ విషయం క్లియర్ అయితే, స్పిరిట్ లో కాస్ట్ అండ్ క్రూ విషయంలో కూడా వస్తున్న రూమర్స్ కి బ్రేకులు పడ్డాయి. ఇందులో హీరోయిన్ గా ఆల్ మోస్ట్ ప్రియాంక చోప్రా అలానే, మృణాల్ ఠాకూర్ కన్ఫామ్ అయినట్టేనని తెలుస్తోంది. ఇక కొరియన్ సూపర్ స్టార్ డాంగ్ లీ స్పెషల్ రోల్ వేస్తుంటే, నెగెటీవ్ రోల్స్ లో సైఫ్ ఆలిఖాన్, కరీనా కపూర్ ఇలా ఈ కపుల్ కూడా కన్ఫామ్ అయ్యింది. బ్యాగ్రౌండ్ మ్యూజిన్ పనులు ఎప్పటి లానే తన ఆస్థాన విధ్వాంసుడు, హర్ష వర్దన్ రామేశ్వర్ కంప్లీట్ చేస్తున్నాడు. ఎటొచ్చిన సాంగ్స్ ఎవరు కంపోజ్ చేస్తారో మాత్రం ఇంకా తేలలేదు.

ఇక స్పిరిట్ విషయంలో ప్రభాస్ అంత ఈగర్ గా వేయిట్ చేయటానికి మేయిన్ రీజన్, ఇది తన 25వ మూవీ మాత్రమే కాదు. తన కెరీర్ లో ఫస్ట్ టైం పోలీస్ పాత్రతో చేస్తున్న మూవీ… అందుకే ఇంతవరకెన్నడూ వేయని పాత్రలో అది కూడా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో కాబట్టి, తనే కాదు ఇండియా మొత్తం ఎగ్జైటెడ్ గానే ఉంది. ఇక వచ్చే ఏడాది మార్చ్ లో ఈ సినిమా సెట్స్ పైకెళ్లడం కన్ఫామ్ అయ్యింది.