Prabhas: స్పిరిట్ విషయంలో సందీప్‌కి ప్రభాస్ అల్టిమేటం..
ఇక మీదట తన సినిమాల షూటింగ్స్ కాని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాని లేటు కాకూడదని స్వీట్ వార్నింగ్ ఇవ్వటంతో, దీపావళికి స్పిరిట్ వర్క్‌ని షురూ చేయబోతున్నాడట సందీప్ రెడ్డి వంగ. నవంబర్ 10న సలార్ రిలీజ్ అవుతుంది.

Prabhas: ప్రభాస్‌తో అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్. నిజానికి దసరాకే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాలి. కాని తను హిందీలో తీస్తున్నయానిమల్ తాలూకు అన్ని భాషల పాటల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అయ్యింది. అందుకే ఆ పనిలో బిజీ అయ్యాడు. అలాంటి తనకి ప్రభాస్ ఆరునెలల గడువే ఇచ్చాడట. ఇక మీదట తన సినిమాల షూటింగ్స్ కాని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాని లేటు కాకూడదని స్వీట్ వార్నింగ్ ఇవ్వటంతో, దీపావళికి స్పిరిట్ వర్క్‌ని షురూ చేయబోతున్నాడట సందీప్ రెడ్డి వంగ.
నవంబర్ 10న సలార్ రిలీజ్ అవుతుంది. అదే రోజు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులకోసం ఆఫీస్‌ని లాంచ్ చేయటం కన్పామ్ అయ్యింది. యానిమల్ మూవీని క్రిస్మస్‌కి రిలీజ్ ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ, నవంబర్ 10 నుంచి జనవరి వరకు ప్రభాస్ మూవీ స్పిరిట్ ప్రి ప్రొడక్షన్ వర్క్ చేస్తాడట. మార్చ్ నుంచి ఆగస్ట్ వరకు స్పిరిట్ షూటింగ్ పూర్తయ్యేలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ దసరాకు సలార్ సందడి మిస్ అయినా.. వచ్చే దసరాకు స్పిరిట్‌తో దాడి కన్ఫామ్ చేసుకుంటున్నాడు.