Prabhas: వదలని లీకులు.. రాజా సాబ్ నుంచి డైలాగ్ లీక్..!

కల్కి మూవీ నుంచి ఈ మధ్యనే కొన్ని లీకులు వైరల్ అవ్వగా.. తెలుగు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ది రాజా సాబ్‌ నుంచి కూడా ఒక లీక్‌ బయటకు వచ్చినట్లు ఓ టాక్ వైరల్‌గా మారింది. రాజా సాబ్‌గా తన లుక్‌తో ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేసేశాడు ప్రభాస్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 03:28 PMLast Updated on: Feb 21, 2024 | 3:28 PM

Prabhass The Raja Saab Movie Dialogue Leaked Online

Prabhas: యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్‌ సలార్‌తో తన కటౌట్‌కు తగ్గ హిట్‌ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అదే జోరుతో ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ టార్గెట్ అంతా కల్కి, రాజాసాబ్‌లపై ఉంది. రెండింటికీ తన కాల్షీట్లు పంచుతూ ఫుల్ ఫోకస్డ్‌గా వర్క్ చేస్తున్నాడు. అయితే.. ప్రభాస్‌ మూవీలకు సంబంధించి లీకులు బయటకు రావడం, అవి వైరల్‌గా మారడం రీసెంట్‌గా కామన్‌ అయిపోయింది.

Pushpa 2: ఆర్ఆర్ఆర్‌ను మించేలా ‘పుష్ప-2’ ఇంటర్వెల్.. పూనకాలు గ్యారెంటీ..

కల్కి మూవీ నుంచి ఈ మధ్యనే కొన్ని లీకులు వైరల్ అవ్వగా.. తెలుగు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ది రాజా సాబ్‌ నుంచి కూడా ఒక లీక్‌ బయటకు వచ్చినట్లు ఓ టాక్ వైరల్‌గా మారింది. రాజా సాబ్‌గా తన లుక్‌తో ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేసేశాడు ప్రభాస్. డార్లింగ్‌ను లుంగీ లుక్‌లో చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ఇది కదా డార్లింగ్ నుంచి మేము కోరకుంటున్నది అంటూ ప్రభాస్‌ లుక్‌ను తెగ వైరల్ చేశారు. వింటేజ్ ప్రభాస్‌ను పూర్తి తెలుగు నేటివిటీ ఉన్న మూవీలో చూడాలన్న కోరిక తీరబోతోందన్న ఆనందంలో ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌. అయితే.. ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ డైలాగ్ లీక్ అయ్యినట్టుగా ఓ లైన్ వైరల్ గా మారింది. కానీ ఇది ఈ సినిమా లోనిది కాదని తెలుస్తోంది. అది జస్ట్ రూమర్ మాత్రమే అని, ప్రభాస్ సినిమా నుంచి మరో లీక్ రాలేదని మరో టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో.. ఇది రూమరేనా అంటూ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఇక.. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక.. ఈ మూవీతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మారుతి ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట. రాజా సాబ్‌లో మాత్రం ట్విస్టులు, ట‌ర్న్‌లు అదిరిపోనున్నాయ‌ని టాక్‌. ముఖ్యంగా సెకండాఫ్‌ని మారుతి చాలా బాగా తీర్చిదిద్దాడ‌ట‌. ఇటీవ‌ల ప్రభాస్‌కి సెకండాఫ్ మ‌రోసారి నేరేట్ చేస్తే ప్రభాస్ స్పెల్ బౌండ్ అయిపోయాడ‌ని టాక్. క్లైమాక్స్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉండ‌బోతోంద‌ని, ప్రభాస్ న‌యా లుక్ అభిమానుల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తుంద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మరి ది రాజాసాబ్ అభిమానుల్ని ఏ రేంజ్‌లో అలరిస్తాడో వేచి చూడాల్సిందే.