Prabhas: ప్రభాస్ అభిమానులకు షాక్.. సలార్ రిలీజ్‌ వాయిదా..?

సెప్టెంబర్‌ 28న సలార్‌ రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఆ తేదీకి సినిమా వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. సెప్టెంబర్ 28న సినిమా విడుదల చేయడం కుదరడం లేదని, డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్లకు సలార్ ఫిల్మ్ మేకర్స్ నుంచి సమాచారం వచ్చిందట..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 1, 2023 | 05:24 PMLast Updated on: Sep 01, 2023 | 5:24 PM

Prabhass Upcoming Movie Salaar Release Postponed

Prabhas: సలార్‌ మీద ప్రభాస్ ఫ్యాన్స్‌ పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్నీ కావు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో మినహా.. అన్ని మూవీస్‌ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాకొట్టడంతో ప్రశాంత్‌ నీల్‌ మీదే భారం అంటూ సలార్‌ కోసం ఈగర్‌గా ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. కేజీఎఫ్‌లాంటి బ్లాక్‌బస్టర్‌ తీసిన ప్రశాంత్ నీల్.. తాము కోరుకున్న విధంగా తమ హీరోను చూపిస్తారని కోటి ఆశలతో ఉన్నారు. ఐతే వాళ్లకు భారీ షాక్ ఇచ్చేందుకు మూవీ టీమ్ రెడీ అవుతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది.

సెప్టెంబర్‌ 28న సలార్‌ రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఆ తేదీకి సినిమా వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. సెప్టెంబర్ 28న సినిమా విడుదల చేయడం కుదరడం లేదని, డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్లకు సలార్ ఫిల్మ్ మేకర్స్ నుంచి సమాచారం వచ్చిందట..! తమ మూవీ రిలీజ్‌ వాయిదా పడుతోందని క్లియర్‌కట్‌గా చెప్పేశారట. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌లో ఒకటే గుసగుస. వాయిదా వేసిన విషయం ముందు ప్రకటించి. ఆ తర్వాత కొన్ని రోజులకు కొత్త విడుదల తేదీ చెబుతారట..! మరి అది డిసెంబరా.. లేదంటే ఆ తర్వాతా అనేది తెలియడానికి కొంత టైమ్‌ పడుతుంది. అమెరికాలో సలార్ అడ్వాన్స్‌డ్‌ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు.

ఇప్పటికే చాలామంది టికెట్లు కొన్నారు కూడా..! ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వాయిదా వేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం సీజీ వర్క్ సరిగా రాకపోవడమే అని తెలుస్తోంది. యాక్షన్ దృశ్యాలతో పాటు కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మీద దర్శకుడు ప్రశాంత్ నీల్ అంత శాటిస్‌ఫై కాలేదట. దీంతో విడుదల వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారట. సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది.