Pragathi Mahavadi: ప్రగతినా మజాకా.. పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో సిల్వర్ మెడల్
ప్రగతి వర్కౌట్ వీడియోలు, ఫొటోలు చూసి అంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. కరోనా టైం నుంచి కూడా ఆమె ఇలాంటి వీడియోస్‌ని తన ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అందరినీ మోటివేట్ చేయడం స్టార్ట్ చేసింది.

Pragathi Mahavadi: టాలీవుడ్‌లో సైడ్ క్యారెక్టర్స్‌లో నటిస్తూ తనకంటూ ఒక మంచి స్థానాన్ని సాధించుకున్న నటి ప్రగతి. అమ్మ, అత్త పాత్రలతో తెలుగు ఆడియన్స్‌కి ప్రగతి బాగా దగ్గరయ్యింది. ఇక ప్రగతి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఒక వైపు మూవీస్‌తో పాటు మరో వైపు తన వర్కౌట్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఎక్కువ మంది ఫాన్స్‌ని సంపాదించుకుంది. ప్రగతి వర్కౌట్ వీడియోలు, ఫొటోలు చూసి అంతా ఆశ్చర్యపోతూ ఉంటారు.
Saif Ali Khan: దేవర’ షూటింగ్‌లో ప్రమాదం.. సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..
కరోనా టైం నుంచి కూడా ఆమె ఇలాంటి వీడియోస్‌ని తన ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అందరినీ మోటివేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఐతే ఇదంతా అవసరమా అంటూ చాలామంది నిరాశపరిచారని, కానీ తాను ఎంతమాత్రం బాధపడలేదంటూ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. అలాంటి ప్రగతి ఇప్పుడు గుంటూరులో జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ సీనియర్, జూనియర్ కాంపిటీషన్స్-2024లో పాల్గొంది. ఈ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఈ వీడియోని ప్రగతి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 47 ఏళ్ళ వయసులో పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసి, సౌత్ ఇండియన్ ఛాంపియన్‌గా నిలవడంతో అంతా షాకయ్యారు.
ఆమె సాధించిన విజయానికి అందరూ విషెస్ చెప్తున్నారు. ఇక ఝాన్సీ, షానూర్ సన అందరూ కూడా ప్రగతి సాధించిన విజయానికి మురిసిపోతున్నారు. ఎంతో మంది మహిళలకు గొప్ప ఇన్స్పిరేషన్‌గా నిలిచారు అంటూ పొగిడేస్తున్నారు నెటిజన్స్.